Back to Explore
Love Infinite | Queer Stories-II
Description
సమాజంలో క్వియర్ (Queer) వర్గాల పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలను, అవగాహనలేమినీ తొలగించడానికి ఆ వర్గాలకు సంబంధించిన సాహిత్యం చాలా అవసరమని భావిస్తాను. జెండర్, లైంగికత(sexuality) అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకి, ఇష్టానికి సంబంధించినవి. 'ప్రకృతి' అని సరిహద్దుల గీసి, అన్ని రకాల లింగాలను(Gender), లైంగిక ధోరణులను(Sexual Orientation) ఆ పరిమితిలోనే బంధించాలని చూడటం తప్పు. ప్రకృతిలో భాగమైన సునామీలు, భూకంపాలు, తుఫానులు మనకు ఘోర ప్రమాదాల్ని కలిగిస్తాయి. మాలాంటి విభిన్న లింగ, లైంగిక ధోరణులు కలిగిన మనుషులు కూడా ప్రకృతిలో భాగమే, అయితే మేము ఎవరికీ ఎలాంటి హానిని, ఆపదనీ కలిగించము. సమాజంలోని ద్వేషం, వివక్ష, వెలివేత, దైనందిన జీవిత సంఘటనలు, సవాళ్లతో కూడిన పోరాటాలు, మానవీయ భావోద్వేగాలు, లింగ సమానత్వం గురించి పాఠకులను ఆలోచింప జేయడానికి ఇటువంటి క్వియర్ కథా సాహిత్యం ఎంతో కీలకం. ఇది సమాజంలో కొత్త దృక్పథాన్ని, సామాజిక మార్పును తీసుకువస్తుందని నేను నమ్ముతున్నాను. తెలుగు సాహిత్యంలోని క్వీర్ కథలను ఒకచోట చేర్చి ప్రచురిస్తున్నందుకు అభినందనలు.
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు; క్వియర్ జీవితాలను, సంబంధాలను మరియు సామాజిక అనుభవాలను ప్రతిబింబించే కథల సంకలనం. సమాజంలోని అపోహలు, ద్వేషం, వివక్ష, వెలివేత వంటి పరిస్థితుల మధ్య వ్యక్తులు ఎదుర్కొనే సంఘర్షణలు, ప్రేమ, సంబంధాలు, స్వీయ గుర్తింపు మరియు సమానత్వం వంటి అంశాలు వివిధ కథల ద్వారా ఆవిష్కరించబడతాయి. ప్రతి కథ వేర్వేరు అనుభవాన్ని ముందుకు తీసుకువస్తూ క్వియర్ జీవితాలపై మరింత మానవీయమైన దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Love Infinite | Queer Stories-II
Prioritized by same author, then publisher, then overlapping genre












