Back to Explore
Valapateddu
Details
Year2024Pages170LanguageTeluguFormatPaperbackISBN978-8198229373
Author
PublisherChaaya Publications
Description
వర్డ్స్వర్త్ని ప్రకృతి కవి అంటారు. కీట్స్ని మనిషి కవి అన్నారు. అయితే, “వర్డ్స్వర్త్ ప్రకృతిలో మనిషి ఉంటాడు. కీట్స్ మనిషిలో ప్రకృతి ఉంటుంది.” అంటాడు జి. కళ్యాణరావు. ఇప్పుడే రాస్తున్న రచయితని అట్లా పొల్చీ పెద్ద చేసి, అతనికి కొమ్ములు తెప్పించి అతనిలో కథకుడిని చంపేయడం ఉద్దేశం కాదు గాని, వివేక్ లంకమల కథలు చదివినప్పుడు కళ్యాణరావు ఎప్పుడో పంచుకున్న ఈ మాట గుర్తొచ్చింది. ఈ కథల్లో ప్రకృతినీ మనిషినీ భాగం చేశాడు వివేక్. నిజానికి చరిత్ర పొడుగుతా మనిషీ ప్రకృతీ వీడదీయలేనంతగా కలిసే ఉన్నాయి. అదే వివేక్ కథల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకృతి చేసింది. మనిషి తన జీవిక కోసం తన ధర్మం నిర్వర్తించాడు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చేయడానికి పూనుకున్నాడో ప్రకృతీ ప్రతిఘటించడం మొదలుపెట్టింది. కొండలు తొవ్వినప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. అడవిని ధ్వంసం చేసినప్పుడు ఎండలు విజృంభించాయి. అడవుల్లో బతికే పులులూ, ఎలుగుబంట్లు, ఏనుగులు పల్లెల మీద పడ్డాయి. ఈ అకస్మాత్తు వరదలన్నీ ప్రకృతిపై మనిషి చేసిన అత్యాచారం తాలుకు ఫలితాలే. లంకమల దారులు అనే ట్రావెలాగ్లోనూ కథల్లో ఉండే శిల్పాన్ని సాధించిన వివేక్ రాసిన కథలివి. కథలు కాదని రాసిన వాటిల్లోనే కథ వుంటే, కథ అంటూ వస్తున్నదాంట్లో ఎంత వుండొచ్చు? మేం చదివాం. నచ్చాయి. మీరూ చదవండి. మునుపటికన్నా ప్రేమిస్తారు.
- అరుణాంక్ లత ఎడిటర్, ఛాయ
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు; పదకొండు కథల సంకలనం. ప్రతి కథలోనూ గ్రామీణ జీవితం, మనుషులు, జంతువులు, ప్రకృతి లేదా సామాజిక పరిస్థితుల్లోని ఒక ప్రత్యేక కోణం కనిపిస్తుంది.
“వలపటెద్దు” కథలో రైతుకు తన ఎద్దులతో ఉన్న అనుబంధం ప్రధానంగా కనిపిస్తుంది. ఎద్దులను కేవలం వ్యవసాయానికి ఉపయోగించే జంతువులుగా కాకుండా తమ జీవితంలో భాగంగా చూసుకునే రైతు మనస్తత్వాన్ని కథ ప్రతిబింబిస్తుంది. ఈ అనుబంధమే పుస్తకానికి “వలపటెద్దు” అనే పేరుకు నేపథ్యంగా నిలుస్తుంది.
“సుక్కపడ్డ” కథలో వరదల కారణంగా ఊరిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి, తమ పశువులను వదిలిపెట్టలేని రైతు అనుబంధం మరియు జీవాన్ని కాపాడేందుకు చేసే ప్రయత్నం కనిపిస్తాయి. “నెత్తర పొడి” గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథ కాగా, **“దున్నలు కుళ్ళేయి”**లో కులం, ఆత్మాభిమానం మరియు సామాజిక విభేదాల అంశాలు కనిపిస్తాయి. “సీటాకు”, “ఎర్ర మరకలు” వంటి కథలు అట్టడుగు వర్గాలు, యానాదుల జీవితం, ఎర్రచందనం కూలీల పరిస్థితులు వంటి అంశాలను స్పృశిస్తాయి.
మొత్తంగా ఈ కథలు రాయలసీమ గ్రామీణ జీవితం, వ్యవసాయం, పశువులతో మనిషి అనుబంధం, ప్రకృతి, కుల-సామాజిక సంబంధాలు మరియు జీవితం కోసం మనిషి చేసే పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Valapateddu
Prioritized by same author, then publisher, then overlapping genre











