Back to Explore
Sitha Sametha Rama
Details
Year2025Pages105LanguageTeluguFormatPaperbackISBN978-81-980171-8-5
Author
PublisherKR Publications
Description
"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య, తడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ."
ఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టె రకంకూడా కాదు. ""ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని.."". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.
"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీతా సమేత రామ"
Plot
సీతా సమేత రామ ప్రేమ, కుటుంబం, మరియు జీవిత నిర్ణయాల మధ్య చిక్కుకున్న ఒక యువతి భావోద్వేగ ప్రయాణం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల మధ్య విభేదాలు, మరియు సమాజం నిర్దేశించే బాధ్యతల మధ్య తన మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆమె కథ ఇది.
ప్రేమను కోల్పోయిన ప్రపంచంలోనూ, నిజమైన అనుబంధాన్ని వెతుక్కుంటూ సాగిన ఈ ప్రయాణంలో ఆమె జీవితంలోకి రామ ప్రవేశిస్తాడు. ఇద్దరి మధ్య ఏర్పడే బంధం ప్రేమకు కొత్త అర్థాన్ని అందిస్తూనే, గాయపడిన మనసులకు ఓదార్పుగా మారుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Sitha Sametha Rama
Prioritized by same author, then publisher, then overlapping genre












