All Reviews
for Prema
Giribabu Dola
3.0
ప్రేమ - జీవితాంతం మోసిన ఒక వ్యక్తి కథ. నిజంగానే ఈ కథలో ఒక వ్యక్తి ప్రేమని జీవితాంతం మోస్తాడు. కారణం, చెప్పడం ఆలస్యం అయిన ప్రతిసారీ ప్రేమ చేజారిపోతూనే ఉంటుంది. గౌతమ్ ప్రతి దశలో తన ప్రేమని చెప్పడంలో వెనకబడతాడు. చెప్పేంత వరకూ వాళ్ళు ఎదురుచూస్తారు అనుకున్నాడు. కానీ, అంత ఓపిక ఈరోజుల్లో ప్రేమకి లేదు. చివరికి తను I Love You చెప్పాడా లేదా అనేది ఆఖరి పేజీలోనే తెలుస్తుంది. అప్పటివరకూ అతని ప్రేమ మనల్ని ఆకట్టుకుంటుంది. మంచి కవర్ పేజీతో, చాలా తక్కువ పేజీలలో ఒక మంచి ప్రేమ కథని చెప్పారు మన గణేష్. ప్రేమలో ఓడిపోయిన వాళ్లకి, జీవితాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వాళ్లకి, నిశ్శబ్దంగా బతుకుతున్న వాళ్లకి - ఈ పుస్తకం ఒక నిశ్శబ్ద నేస్తం.