All Reviews
for Devudu Chesina Porapatu
దేవుడు చేసిన పొరపాటు - ఇది ప్రభాకర్ మచ్చ గారి రెండో పుస్తకం. టైటిల్ ని justify చేసేలాగే ఉంటుంది కథ. ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి కోసం, తను అడిగినట్టే ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్తాడు. చివరికి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా లేదా అనే ఎండింగ్ తో ముగించాల్సిన కథని, ఒక ఊహించని ట్విస్ట్ తో ఆశ్చర్యపరిచాడు మన ప్రభాకర్. పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటాం కదా, అలా! ఈ పుస్తకం కేవలం ప్రేమ కథ కాదు. ఎందుకంటే, ప్రేమ కథలో ఇతిహాసాల గురించి, మతం లేకపోతే ఈ సమాజం ఎలా ఉంటుందో అన్న దాని గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించీ లోతుగానే చెప్పారు. అమ్మాయి అబ్బాయి సమానం అనే చర్చ జెండర్ ఈక్వాలిటీ అయితే, మరి మిగిలిన జెండర్ ల పరిస్థితి ఏంటి అనేదే ముఖ్యమైన ప్రశ్న ఈ పుస్తకంలో. చదువుతూ ఉంటే, దేవుడు చేసిన చాలా పొరపాట్లు మీకు తెలుస్తుంటాయి. అయితే, అవి నిజంగా దేవుడు చేసిన పొరపాట్లేనా కాదా అనేది తెలుసుకోవాలంటే, ఈ పుస్తకం చదవాల్సిందే.