All Reviews
for Digital Love
Giribabu Dola
3.0
Digital Love - ఇది కొత్తతరం ప్రేమ కథా పుస్తకం. ఈ నవలలో నేటితరం పిల్లలు ఎలా ప్రేమించుకుంటున్నారు, కనెక్షన్స్ ని ప్రేమ అనుకుని ఎలా మోసపోతున్నారు, కనీసం కలవకుండానే ఎలా విడిపోతున్నారు అనే అంశాలను బాగా చెప్పారు. ఇప్పటి relationships అన్నీ convenient గా మొదలవుతున్నాయని, విడిపోయాక screenshots నే జ్ఞాపకాలుగా దాచిపెట్టుకుంటున్నారని - రియాలిటీని కళ్ళకి కట్టినట్టు చెప్పారు మన గణేష్. చాలా తక్కువ పేజీలలో ఉండే ఈ పుస్తకం ఈజీగా చదివేయొచ్చు. మన వాడుక భాషలోనే రాశారు మాటలన్నీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక స్పెషల్ పర్సన్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి ఉంటే, ఈ కథ మీదే. కనెక్ట్ అయిపోతారు.