Back to Explore
Niseedhi Naadam
Details
Year2026Pages226LanguageTeluguFormatPaperbackISBN978-8199919211
Author
PublisherAkshata Publications
Description
నమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది…. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా…. డిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు…. నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ? ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి? వనసీమ లోలోపలి భాగాల్లో, తరతరాలుగా నివాసముంటున్న మహా మాంత్రికులు నిజంగా వున్నారా? ఎవరు వారు? ఏమా చరిత్ర? ఇంతకూ, కదిలే చెట్టు కథేంటి? నిశీథినాదం రహస్యమేమిటి? ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను మలుపు తిప్పగలిగారా ? అడుగడుగునా ఉత్సుకతను కలిగిస్తూ, ఆద్యంతం ఆసక్తితో చదివించే నవల “నిశీథినాదం”
Plot
నిశీథి నాదం ఒక విచిత్రమైన వార్తతో ప్రారంభమయ్యే రహస్యభరిత నవల. ఒక దినపత్రిక ప్రచురించిన ఆశ్చర్యకరమైన సమాచారం ఆధారంగా, ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన పరిశోధనలో భాగంగా వనసీమ అడవిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, అనుకోని నిజాలు, మరియు అర్ధరాత్రి జరిగిన అనుభవాలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు నడిపిస్తాయి.
వనసీమ అడవిలో తరతరాలుగా నివసిస్తున్న మహా మాంత్రికుల కథలు నిజమా? “కదిలే చెట్టు” వెనుక రహస్యం ఏమిటి? “నిశీథి నాదం” అనే మర్మం ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను ఎలా ప్రభావితం చేసింది? అనే ప్రశ్నలతో కథ మిస్టరీ, అడ్వెంచర్, మరియు అతీంద్రియ అంశాల మధ్య సాగుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Niseedhi Naadam
Prioritized by same author, then publisher, then overlapping genre




