Back to Explore
Ijak
Details
Year2025Pages300LanguageTeluguFormatPaperbackISBN978-8199011892
Author
PublisherAju Publications
Description
ఏంటి ఐజాక్ అంటే? ఒక రెండేళ్ల క్రితం బుర్రలో నాటుకున్న చిన్న ఆలోచన. ఆ ఆలోచన మీద కాసిని నీళ్ళు జల్లి పెరట్లో రోజూ చూసుకుని మురిసిపోయే చిన్న గులాబీ మొక్కని చేద్దాం అనుకున్నాను. వ్రాయడం మొదలు పెట్టాక మొక్క మానయ్యింది. నీడనిచ్చే చోటయ్యింది. రెండేళ్లుగా నా దినచర్యలో భాగమయ్యింది. నా చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకాల మీద ఉండే బేతాళ విక్రమార్కుల బొమ్మలు నన్ను బాగా ఉత్తేజ పరిచేవి. కొంచెం వయసు పెరిగాక ఆ కుతూహలం కొండంతై అంత కన్నా పెద్ద కథల వైపు మళ్ళింది. ఆ చిన్ననాటి ఉత్సాహం, కుతూహలం ఈ నవలలో బాగా కనిపిస్తుంది (అనుకుంటున్నాను). ఈ నవలలో ఉండే పేర్లు, స్థలాలు చాలా వరకు చరిత్ర నుంచి తీసుకున్నవి. ఈ నవల చరిత్ర పాఠం కాదు. పేర్లు బాగున్నాయని వాడుకున్నాను అంతే. ఈ నవల పూర్తిగా కల్పితం. కానీ మీరు ఈ నవల మొదటి భాగంలో ఉపయోగించిన కొన్ని స్థలాల పేర్లు అంతర్జాలంలో వెతికితే వాటి నిజమైన భౌగోళిక ఆనుపానులు తెలుసుకోవచ్చు. ఎన్నో మంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవచ్చు. నా నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ కథలో ఎన్నో పాత్రలు, ఎన్నో స్థలాలు ఉంటాయి. మీకు వీలైతే నవలను తక్కువ సమయంలో ముగించడానికి ప్రయత్నించండి లేకపోతే అన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అని ముందుగా నవలను చదివిన నా మిత్రుల సలహా. మీ జ్ఞాపక శక్తి మంచిదైతే అలాంటి కాల నియమాలు ఏవీ మీరు పాటించక్కర్లేదు. మిమ్మల్ని వేగంగా చదివించగలగితే మాత్రం నేను విజయం సాధించినట్టే భావిస్తాను.
Plot
‘ఐజాక్’ ఒకే కథానాయకుడి చుట్టూ సాగే సాధారణ కథ కాకుండా, అనేక పాత్రలు మరియు అనేక ప్రదేశాలతో విస్తరించే కల్పిత ప్రపంచాన్ని నిర్మించే నవల. చరిత్రలోని పేర్లు, ప్రదేశాల సూచనలను ఆధారంగా తీసుకుని వాటిని కల్పిత కథనంతో మేళవిస్తుంది.
చిన్ననాటి కథలపై ఉన్న ఉత్సాహం, తెలియని ప్రపంచాలపై పెరిగే కుతూహలం, అనేక పాత్రలు మరియు ప్రదేశాల మధ్య సాగే కథనం ఈ నవలలో ప్రధానంగా కనిపిస్తాయి. పాఠకుడు కథను వేగంగా చదువుతూ పాత్రలు, ప్రదేశాలను గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాల్సిన నవలగా రచయిత స్వయంగా సూచిస్తున్నారు.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Ijak
Prioritized by same author, then publisher, then overlapping genre










