Back to Explore
Godavathala...ivathala kathalu kooda
Details
Year2025Pages166LanguageTeluguFormatPaperbackISBN978-8199011854
Author
PublisherAju Publications
Description
మెరుగైన సమాజం నిర్మాణం కావాలంటే ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు పాదులూనుకోవాలి. అందుకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. సకల ఆధిపత్యాలు సమసిపోవాలి. విభిన్న అంశాల్లో అందరికీ న్యాయబద్ధంగా సమానావకాశాలు దక్కాలి. ఇందుకు నైతికత ఇరుసు కావాలి. రాజకీయోద్యమాలకు ‘స్వేచ్ఛ’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతృత్వం’ పునాది అని అంబేడ్కర్ చెప్పిండు. రాజకీయోద్యమాలతో పాటు, సామాజిక, సాంస్కృతికోద్యమాలకు ఆసరాగా నిలిచేది, వాటిని ముందుకు తీసుకెళ్ళేది సాహిత్యం. ఇప్పుడు ‘గోడవతల’ కథా సంపుటి ద్వారా స్వర్ణ కిలారి మన పట్టింపులో లేని జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి, చదివించే భాషలో కథనం చేసిండ్రు. రోగగ్రస్థమైన సమాజానికి సాహిత్యం చికిత్స చేస్తుందని ఈ కథలు నిరూపించాయి. నిజానికి ఈ కథలు వ్యక్తిగత అభిప్రాయంగా కనిపించే సామూహిక వ్యక్తీకరణ. ఈ సాహిత్యం సామాజిక, సాంస్కృతికోద్యమాలకు భవిష్యత్ భరోసా.
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు; సామాజిక జీవితంలోని విభిన్న కోణాలను ప్రతిబింబించే కథల సంకలనం. సమాజంలో “గోడకు అవతల” లేదా “ఇవతల” ఉండిపోయే జీవితాలను కథలుగా మార్చుతూ, సాధారణంగా మన దృష్టికి రాని మనుషుల సమస్యలు, సంబంధాలు, అసమానతలు మరియు సంఘర్షణలను రచయిత్రి పరిశీలిస్తారు.
ఈ కథల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎదురయ్యే అడ్డంకులు, కుల–వర్గ–లింగ ఆధిపత్యాలు, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలు, సామాజిక అసమానతలు వంటి అంశాలు వివిధ పాత్రలు మరియు జీవిత అనుభవాల ద్వారా వ్యక్తమవుతాయి. వ్యక్తిగతంగా కనిపించే సమస్యల వెనుక ఉన్న సామాజిక నిర్మాణాలను కూడా ప్రశ్నించే దృక్కోణం ఈ కథలకు ఉంటుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Godavathala...ivathala kathalu kooda
Prioritized by same author, then publisher, then overlapping genre












