Back to Explore
Inthiyanam
Details
Year2023Pages320LanguageTeluguFormatPaperbackISBN978-9395117197
Author
PublisherAnvikshiki Publishers
Description
నలభై ఐదుగురు స్త్రీలు చేసిన ప్రపంచవ్యాప్త పర్యటనానుభవాల కదంబమాలిక ఇంతియానం. ఒక మంచి ప్రయత్నం, యాంత్రిక దినచర్య నుంచి ఊపిరి పీల్చుకోడానికి చేసే మొక్కుబడి ప్రయాణాలు కావివి. ప్రకృతి ఆస్వాదన, పరిసరాల పరిశీలన, సామాజిక పరిస్థితులు, ప్రజాజీవనం, రాజకీయాలు, ముఖ్యంగా అక్కడి స్త్రీల జీవనం. అన్ని గమనించుకుంటూ తమ దృక్కోణం నుంచి విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలున్నాయి. వారు చేసిన సాహసాలున్నాయి. - పి. సత్యవతి ఈ 'ఇంతియానం' శీర్షికే గంభీరంగా ఉంది. ఇందులో ఒక నిశ్చయం. స్పష్టతల ధ్వని ఉంది. యానం లో ధైర్య, విజయ శబ్దాల స్ఫురణ ఉంది. ఇది పోరాటమే. యులిసిస్ అన్నట్టు 'యుద్ధ కాంక్ష ఇంకా తేడిగా ఉంది. సముద్రం పిలుస్తుంది. ఇక్కడ, మొనాటనీ మీద, స్త్రీని ఇల్లు కదలనివ్వని భయం మీద, ఇల్లే వైకుంఠం అనుకునే అజ్ఞానం మీద పారు. అనివార్యంగా, ఒక అడుగు బయటకు వేయగానే లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. అంతర్యానం, సత్యాన్వేషణ కూడా మొదలౌతాయని తెలియచెప్పిన ఇంతియానపు ముచ్చట్లు ఇవి.. - పద్మజ సూరపు రాజు
Plot
ఇది ఒకే కథను చెప్పే నవల కాదు; 45 మంది మహిళల విభిన్న యాత్రా కథనాల సమాహారం. కొందరు ఒంటరిగానూ, మరికొందరు కుటుంబంతో లేదా స్నేహితుల బృందాలతోనూ చేసిన ప్రయాణాల ద్వారా ప్రకృతి, ప్రజలు, సంస్కృతి, చరిత్ర మరియు సమాజాన్ని పరిశీలిస్తారు. బయట ప్రపంచాన్ని అన్వేషించే ఈ ప్రయాణాలు, వ్యక్తిగత అనుభవాలు మరియు అంతర్ముఖ అన్వేషణకు కూడా దారితీస్తాయి. అందువల్ల ఇంతియానంలోని యాత్రలు కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడమే కాకుండా, కొత్త ప్రపంచాన్ని మరియు తమను తాము కొత్త దృష్టితో చూసే అనుభవాలుగా నిలుస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Inthiyanam
Prioritized by same author, then publisher, then overlapping genre












