Back to Explore
Manchupuvu
Details
Year2024Pages125LanguageTeluguFormatPaperbackISBN978-9395117883
Author
PublisherAnvikshiki Publishers
Description
గత దశాబ్ద కాలంలో 'నేనూ- చీకటి' తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే, 'తపన' ఒక ఝం ఝూ మారుతం అయింది. 'రాళ్ళెత్తిన కూలీ' కథా సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది. “సర్టిఫికేట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక్క సర్టిఫికేట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మకాల్తో పాటు ఓ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు. అంతే!" అంటారు శ్రీ వేణుగోపాల్. ఇంకా - "బ్రహ్మచారిని. మంచి పద్యమూ, మద్యమూ - రెండూ నాకు ప్రీతి. అమ్మ కీ.శే. హనుమాంబ చిన్నప్పుడే వల్లె వేయించిన ‘అమరకోశమూ,' చదివించిన 'రఘు వంశమ' ఈ రోజుకీ నాకు ఉపయోగపడ్తున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు. ‘కాఫ్కా, ‘గొగే, 'హరిప్రసాద్ చౌరాసియా'లు యీయనకిష్టులు. రాగాలు, రంగులూ, అక్షరాలూ యీయన స్నేహితులు. మురళి, వీణ వాయించే వారు. యాంత్రిక ప్రపంచం మీద అలిగి వాటిని తాకడం మానేసి ఆరేళ్ళయింది. "తెలుగు సాహితీ రంగంలో అసహనంతో ఉవ్వెత్తున లేచిన బడబాగ్ని తరంగం" అని ఓ అభిమాని అన్న మాటలు సత్యదూరం కావు.
Plot
ఒక కాలేజీ లెక్చరర్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని ఈ నవల సాగుతుంది. అతని భార్య కావేరి మరణించిన తర్వాత, ఆమె పోలికలతో పెరుగుతున్న కూతురు ప్రియతో అతనికి ఉన్న అనుబంధం క్రమంగా సంక్లిష్టమైన మానసిక సంఘర్షణకు దారితీస్తుంది.
ప్రియ కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో తండ్రి మనసులో ఉద్భవించే నిషిద్ధ ఆకాంక్షలు, వాటిని అర్థం చేసుకోవడానికి మరియు నియంత్రించడానికి అతను చేసే అంతర్గత పోరాటం కథలో కీలకంగా మారుతుంది. అతని స్నేహితుడు సుబ్బు, దుబాయ్ స్నేహితుడు షుకూర్, ప్రియ పాఠశాల ప్రిన్సిపాల్ మల్లిక వంటి పాత్రలు కూడా కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
సుబ్బు ఆత్మహత్య తర్వాత కథానాయకుడి ఆలోచనా ప్రపంచంలో మార్పు మొదలవుతుంది. తనలోని చీకటి కోరికలను, వాటి వల్ల ఇతరుల జీవితాలపై పడే ప్రభావాన్ని అతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంఘర్షణ ద్వారా వ్యక్తి కోరికలు, నైతికత, కుటుంబ బంధాలు, బాధ్యత, మానసిక నియంత్రణ వంటి ప్రశ్నలను నవల ముందుకు తెస్తుంది.
మంచుపువ్వు సాధారణ ప్రేమకథ లేదా కుటుంబ కథ కాదు. మనిషి అంతరంగంలోని అసౌకర్యకరమైన కోణాలను నేరుగా పరిశీలించే, మానసిక మరియు తాత్విక ప్రశ్నలను లేవనెత్తే నవలగా దీనిని చూడవచ్చు.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Manchupuvu
Prioritized by same author, then publisher, then overlapping genre












