Back to Explore
Just A Housewife
Details
Year2024Pages110LanguageTeluguFormatPaperbackISBN978-9334166330
Author
PublisherAnvikshiki Publishers
Description
అపురూపమైన బంధాల చలువ నీడల్లో పూదోటల్ని పెంచుకున్న ఒకానొక స్త్రీ రస హృదయంలో కదిలే ఉద్వేగాలకు అక్షరరూపం, అనుభవాల తాలూకు రవ్వల వెలుగులో జీవితాన్ని కళాత్మకం చేసుకునే ఆమె ప్రయత్నం- ఈ కవిత్వం. చిత్రిక పట్టని మాటల వెల్లువ, ఒద్దిక మరువని ఊహల మధురిమ కలగలిసి పలికిన గొంతుక ఈ సంపుటి లోది. ఈ కవిత్వం, ఇప్పుడిప్పుడే విప్పారుతున్న పూవు. విరామం తరువాత శృతి చేయబడుతోన్న వీణ. ఎన్నేళ్ళ మౌనాన్నో ధిక్కరించుకుంటూ పలుకుతోన్న తొలిమాట. ఈ కవిత్వంలోని భావం పక్వం గాని కాయల్ని కోసేటప్పుడు తగిలే నూగులా గుచ్చుతుంది. ఈ మాటల్లోని గరగర 'జస్ట్ ఎ హౌజ్ వైఫ్' అనిపించుకునే మహిళల గొంతులో ఒదిగిన రహస్యాల ఆనవాలు. ఈ పుస్తకం వాళ్ళు వదిలేసుకున్న కల. జీవితం కాస్త తెరిపినిచ్చిన మలుపులో, ఊపిరి తీసుకోవడానికి ఆగి, వాళ్ళు మళ్ళీ సాధన చేస్తున్న కళ. -మానస చామర్తి, కవయిత్రి
Plot
ఈ సంకలనం ఒకే కథను చెప్పే పుస్తకం కాదు. వివిధ అనుభవాలు, భావోద్వేగాలు, బంధాలు, స్త్రీ జీవితంలోని అంతర్మథనాలు కవితల రూపంలో వ్యక్తమవుతాయి.
ఎన్నాళ్లుగానో మౌనంగా ఉన్న గొంతు మళ్లీ పలకడం, జీవితంలో కొంత విరామం దొరికినప్పుడు తనలో మిగిలిపోయిన కళను తిరిగి సాధన చేయడం, వదిలేసుకున్న కలలను మళ్లీ గుర్తు చేసుకోవడం వంటి అనుభూతులు ఈ కవిత్వానికి ప్రధానమైన నేపథ్యంగా కనిపిస్తాయి.
కుటుంబం కోసం తన వ్యక్తిగత కోరికలను వెనక్కి పెట్టిన మహిళ మనసులో దాగి ఉన్న మాటలు, ప్రశ్నలు, ఆశలు, అనుభవాలు ఈ కవితల్లో స్వరాన్ని పొందుతాయి. అందుకే ‘Just A Housewife’ ఒక మహిళ తనను తాను తిరిగి పలకరించుకునే కవితా ప్రయాణంలా నిలుస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Just A Housewife
Prioritized by same author, then publisher, then overlapping genre












