Back to Explore
Falam Leni Kalam
Details
Year2026Pages166LanguageTeluguFormatPaperbackISBN978-8199919266
Author
PublisherAkshata Publications
Description
ఒక పుస్తకం నీ జీవితాన్నే మార్చేస్తుందంటే - జీవితం అనే పుస్తకాన్ని పట్టుకో, ఎందుకంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు బోలెడున్నాయి, ఇంకా మన జీవితం నుండి పక్కవాళ్ళకి నేర్పాల్సిన పాఠాలు కూడా చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఆ రోజు తప్పకుండా ఎదురవుతుంది, లక్ష్యసాధనకై జీవితం అనే సాగరాన్ని ఈదడానికి, టాలెంట్ అనే నౌకతో అష్టకష్టాలు పడి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, ఎన్నో విలువైన వాటిని నష్టపోయి, చివరగా వేయాల్సిన ఒక్క అడుగు దగ్గరే ఆగిపోతాము. ఇన్ని అడుగులు వేస్తూ వచ్చిన నీకు, ఆ ఒక్క అడుగు మాత్రం గగనతరమవుతుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా...? జీవితం అనే క్లిష్టమైన సబ్జెక్ట్ ని మనకు ఎవ్వరూ నేర్పించరు, ఇక్కడ కాసేపు ఆగు అని జీవితంలో మనకు చెప్పడానికి రెడ్ సిగ్నల్స్ ఉండవు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పడానికి గ్రీన్ సిగ్నల్స్ కనిపించవు, నువ్వు వెళ్లే వేగం తగ్గించు అని చెప్పడానికి నారింజ సిగ్నల్స్ ఎదురవ్వవు, నువ్వు దారి తప్పుతున్నావ్ అని చెప్పడానికి డేంజర్ సిగ్నల్స్ ఉండవు. ఇలాంటివన్నీ నీలా లక్ష్యాన్ని సాధించడానికి వెళ్లే ప్రతి యోధుడికి, యోధురాలికి ఎదురయ్యేవే, కానీ ఆ పరిస్థితుల్లో - మనం ఏది పట్టుకోవాలి - ఏది వదిలేయాలి, ఎక్కడ అడుగు ముందుకు వేయాలి - ఎక్కడ ఆగాలని నీకు తెలియకపోతే, జీవితం అనే సముద్రంలో అందరిలాగే నువ్వు కొట్టుకుపోవడం ఖాయం. మరి ఎలా ఆ సముద్రాన్ని ఈదడం...?
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Falam Leni Kalam
Prioritized by same author, then publisher, then overlapping genre












