Back to Explore
Vaana Kurisinappudu Maa Intlo
Description
‘వాన కురిసినపుడు మా ఇంట్లో’ అని పాడిన ఖదీర్ గొంతు సుమధురం, శ్రావ్యం, హృదయాన్ని పరవడం అంటే ఇది కదా అనిపించిన అనుభూతి కావ్యం! కఠోరమైన అక్షర తపస్సు చేసిన జెన్ రుషి లాంటివాడు మాత్రమే కనుగొనగలిగిన కాలిబాట ఇది. దుర్గమారణ్యాల్లోనో, హిమాలయాల్లోని మానస సరోవరాల్లోనో మాత్రమే దొరికే అరుదైన కాంతి లాంటి వచనం ఇది. సందేహం లేదు... ఒక సాదత్ హసన్ మంటో... ఒక మగ్దూం మొహియుద్దీన్... ఒక ఇస్మాయిల్... ఒక వైకం మహమ్మద్ బషీర్.... ఒకే ఒక్క మహమ్మద్ ఖదీర్. – తాడి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ చిన్నతనాన కురిసిన వానలు ఎన్నో ఏండ్లు అయ్యాక కూడా మనసును శుభ్రపరిచి, గొంతు తడిపి సేద తీర్చడం సార్వజనిక అనుభవం. అవి స్ఫురణకు రావడం ఆలస్యమైతే మనస్సు కనీసం సరైన సమయానికి మాన్ సూన్ వానలను కురిపించుకోవాలి. సజలాలతో ప్రక్షాళన కావటం అక్షరాలతో పనున్న వారికి మరీ అవసరం. అలాంటి వానతో మొదలై మనుషుల మీంచి, నగరాల మీద నుంచి, బ్రతుకులు, బ్రతుకుతెరువుల మీంచి అలా అలా సాగిన పురాస్మతుల సువాసనల గుల్దస్తా ఖదీర్‌బాబు పుస్తకం– ‘వాన కురిసినపుడు మా ఇంట్లో’. ఈ వానలో తడిసి నేను ముద్దయ్యాను. – పద్మజ సూరపరాజు, విమర్శకురాలు.
Plot
వాన కురిసినప్పుడు మా ఇంట్లో జ్ఞాపకాలు, మనుషులు, నగరాలు, బాల్యం, మరియు జీవిత అనుభవాలను ఆత్మీయంగా ఆవిష్కరించే వ్యాసాల సంకలనం. వాన జ్ఞాపకాలతో మొదలయ్యే ఈ రచనలు వ్యక్తిగత అనుభూతులు, మానవ సంబంధాలు, మరియు కాలంతో మారిపోయే జీవిత దృశ్యాలను సున్నితంగా ప్రతిబింబిస్తాయి.
స్మృతులు, భావోద్వేగాలు, మరియు జీవితపు చిన్న చిన్న క్షణాలను సహజమైన భాషలో రచయిత ఆవిష్కరించిన ఈ పుస్తకం పాఠకుడికి వ్యక్తిగత అనుభూతిలా అనిపిస్తుంది.
Books Similar to Vaana Kurisinappudu Maa Intlo
Prioritized by same author, then publisher, then overlapping genre












