All Review Entries
ఏ దేవి వరము నీవో... ఇది మహేష్ & దినేష్ ఇద్దరూ కలిసి రాసిన పుస్తకం. పార్థసారథి తన పాత ప్రేమ నుండి దూరంగా వచ్చేసి, శ్రీలేఖని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంటాడు. శ్రీలేఖ పార్థసారథి డైరీ ద్వారా ఆ పాత ప్రేమ కథని తెలుసుకొని, విషాదంగా మిగిలిపోయిన ఆ ప్రేమ కథని ఎలా ముగించిందన్నదే కథ. అన్నిసార్లూ ముగించడం అంత తేలిక కాదు. అలా మధ్యలో ఆగిపోయిన కథలన్నీ జ్ఞాపకాల వలలో చిక్కుకొని, ప్రతిరోజూ ప్రేమించమని వేధిస్తుంటాయి. ఇక ప్రేమించక తప్పుతుందా! ఈ కథలో శ్రీలేఖ పార్థసారథికి దొరికిన ఒక వరం. ఆ వరాన్ని అందించిన ఒక దేవి కథే ఈ 'ఏ దేవి వరము నీవో'. ఒక మంచి ప్రేమ కథను చదివిన feeling వస్తుంది. అక్కడక్కడా వచ్చే ప్రేమ కవితలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. నిజానికి, ఇది happy ending ఓ, sad ending ఓ తేల్చి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. చదివి మీరే decide చెయ్యండి. బుక్ అమెజాన్ లో available గా ఉంది.
నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో... ఇది మణికాంత్ గారి మొదటి పుస్తకం. ఫారిన్ లో జాబ్ చేస్తున్న వరుణ్, తన తండ్రి మరణ వార్త విని ఇండియాకి బయలుదేరుతాడు. అలా వచ్చేటప్పుడు, తన తండ్రి వెంకట్రావ్ ను గుర్తు చేసుకునే ప్రాసెస్ ఏ ఈ కథ. ఈ కథలో తండ్రి తనకు నచ్చినట్లు ఉంటాడు. ఎలా అంటే, family ని పట్టించుకోకుండా, వ్యసనాలకు లోబడి, తన కొడుకు దగ్గర 500 రూపాయలకు చేయి చాచేంతలా ఉంటాడు. అంత మాత్రాన తండ్రిని తక్కువ చేసి చూడాలా? అతని నీడ కూడా మీద పడకూడదన్నంత దూరం పెరిగెత్తాలా? లేదు, ఎందుకంటే నడక నాన్న నేర్పేది మాత్రమే కాదు. మనం నేర్చుకునేది కూడా. ఎప్పుడూ నాన్న ఏం చేశాడు? ఏం ఇచ్చాడు? అని కాకుండా, ఏదైనా చేస్తేనే లేదా ఇస్తేనే నాన్న అవుతాడా, జన్మనిచ్చాడు అది చాలదా అనే కోణంలో ప్రతి నాన్నని మరింత గొప్పగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. ఎందుకో, నాన్నని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనం అందరం ఎప్పుడో వెనకబడ్డాం. ముందుకు నడిపించే ప్రయత్నమే ఈ పుస్తకం.




