Back to Explore
Tella kaaki and other stories
Description
పూర్వజన్మలో తానొక మైనా పిట్టననుకొనే రాకుమారి వెయ్యి రూపాయల ధర పలికిన కొబ్బరికాయ మాటలతో మూటలు నింపిన గొర్రెల కాపరి... రాజులు, పేదలు, దాతలు, లోభులు, విజ్ఞులు, మూర్ఖులు, వింత వ్యక్తులు, తమాషా మనుషులు - ఇలాంటి వారంతా ఈ కధల్లో మీకు తారసపడతారు. తాను జవాబు చెప్పలేని ప్రశ్న వేసేవాడినే పెళ్ళాడతానన్న గడసరి రాకుమారి ఆశబోతు బంధువులను బూడిదతో బురడీ కొట్టించిన అనాధబాలుడు కష్టాల్లో ఉన్న వృద్ధదంపతులకు కాపాడిన మాయడోలు...సుధామూర్తికీ చిన్నపుడు ఆమె తాత, అవ్వ ఇలాంటి కధలు చాలా చెప్పారు. కొన్ని ఇతర దేశాల్లో స్నేహితులు చెప్పగావిన్నవి. ఎన్నటికి వన్నె తరగని ఆహ్లాదకరమైన ఈ జానపద కధలను పిల్లలకు ఆమె ఎన్ని మార్లు చెప్పారో లెక్కలేదు! చిన్నాపెద్దా అందరినీ అలరించే ఈ కధలను మరెందరో చదివి ఆనందిస్తారని కోరుకుంటున్నాము.
Plot
తెల్ల కాకి మరియు ఇతర కథలు పుస్తకంలో రాజులు, రాకుమారులు, పేదలు, దాతలు, లోభులు, తెలివైనవారు, మరియు విచిత్రమైన మనుషుల చుట్టూ తిరిగే 30కి పైగా జానపద కథలు ఉన్నాయి. తాను జవాబు చెప్పలేని ప్రశ్న అడిగిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పే తెలివైన రాకుమారి, బూడిద మూటతో ఆశపడి మోసపోయే బంధువులను ఓడించే అనాధ బాలుడు, మాయా డోలు సహాయంతో కష్టాల నుంచి బయటపడే వృద్ధ దంపతులు వంటి పాత్రలు ఈ కథల్లో కనిపిస్తాయి.
తెలివి, దయ, ఆశ, మరియు జీవిత పాఠాలను సరదాగా చెప్పే ఈ కథలు చిన్నారులతో పాటు పెద్దలను కూడా అలరిస్తాయి.
Books Similar to Tella kaaki and other stories
Prioritized by same author, then publisher, then overlapping genre











