Back to Explore
Ame O Spurthi Gaadha
Details
Year2026Pages114LanguageTeluguFormatPaperbackISBN978-8199919204
Author
PublisherAkshata Publications
Description
ఇది ఓ మనసు నడిచిన నిశబ్ద ప్రయాణం..!! ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది... ప్రతి కథ వెనుక ఒక పోరాటం ఉంటుంది... ప్రతి పోరాటం వెనుక ఒక ఆత్మగౌరవం ఉంటుంది... కలలతో మొదలైన ఓ యువతి జీవితం, పరిస్థితుల ప్రవాహంలో ఎన్నో మలుపులు తిరుగుతుంది. ప్రేమను నమ్మిన హృదయం గాయపడుతుంది. ఆశలు చిద్రమవుతాయి. అనుబంధాలు ప్రశ్నార్థకమవుతాయి. కానీ ఆమె కృంగిపోలేదు... కన్నీళ్లను దాచుకుంటూ... గాయాలను భరిస్తూ... ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంతో పోరాడుతుంది. "ఆమె... ఒక స్ఫూర్తి గాథ" కేవలం ఒక మహిళ కథ కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో, ప్రతి మౌనం వెనుక దాగి ఉన్న వేలాది మహిళల జీవన ప్రతిబింబం. ఈ కథ చదివాక మీరు ఒక పాత్రను కాదు... ఒక స్త్రీ హృదయాన్ని గుర్తుంచుకుంటారు అని భావిస్తున్నాను.
Plot
ఆమె... ఓ స్ఫూర్తి గాథ కలలతో జీవితం ప్రారంభించిన ఒక యువతి, అనుకోని పరిస్థితులు, విరిగిపోయిన ఆశలు, మరియు గాయపరిచిన అనుబంధాల మధ్య తనను తాను కోల్పోకుండా ఎలా నిలబడిందనే కథ.
ప్రేమను నమ్మిన ఆమె హృదయం ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటుంది. జీవితంలో ఎదురైన అవమానాలు, నిరాశలు, మరియు ఒంటరితనాన్ని తట్టుకుంటూ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం కథకు కేంద్రబిందువుగా నిలుస్తుంది.
ఇది ఓ మహిళ జీవిత ప్రయాణం మాత్రమే కాదు. కష్టాలను ఎదుర్కొంటూ నిలబడే ప్రతి మహిళకు ప్రతిబింబంగా నిలిచే గాథ.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Ame O Spurthi Gaadha
Prioritized by same author, then publisher, then overlapping genre












