Back to Explore
Letters to Love - A Collection Of Love Letters
Details
Year2019Pages130LanguageTeluguFormatPaperbackISBN978-8198455673
Author
PublisherKadali Writes and Publications
Genres
Description
మనందరికీ ఒక పేరుంటుంది. అది మనకి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఆ పేరు మనం కాదు. అది కొన్ని అక్షరాల సమాహారం మాత్రమే. కానీ కడలి అనే పేరు కేవలం కొన్ని అక్షరాలు మాత్రమే కాదు. పేరుకి తగ్గట్టే ఆమెలో సముద్రమంత ప్రేమ ఉండుండాలి. సరైన పదాలు లేవుగానీ, ఉండుంటే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రేమ లేఖను రాసుండేవాడినంటాడు ఫిట్జెరాల్డ్. కడలికి ఆ సమస్య లేనట్టే ఉంది. ఆమెలోని అంతులేని ప్రేమకు సాక్ష్యం ఈ`లెటర్స్ టు లవ్‘.
Plot
ఇప్పటి కాలానికి ప్రేమలేఖ ఒక టైం వేస్ట్ వ్యవహారం, కాస్త పాతవాళ్లకైతే ఓ అందమైన ఙ్ఞాపకం. ఈ ఎస్సెమ్మెస్ ల కాలం లోనూ ప్రేమ లేఖలు రాసేవాళ్ళున్నారా? ప్రేమలోని అనేక కోణాలను అర్థం చేసుకునే వాళ్ళున్నంత కాలం ప్రేమలేఖలు ఉంటాయి. ఇదిగో పాతికేళ్లు దాటని ఓ అమ్మాయి రాసిన ప్రేమలేఖలు "లెటర్స్ టు లవ్, కడలి ప్రేమలేఖలు". ఇవి ప్రేమికుడికో, ప్రియురాలికో మాత్రమే పరిమితమైనవి కావు, ఇవి మనిషిలో సహజంగా ఉండే స్పందనలకు ప్రతి స్పందనలు. సముద్రానికో, ఆకాశానికో, ఏ అర్థరాత్రో కనిపించే నక్షత్రానికో చెప్పుకున్నట్టు రాసుకున్న లేఖలు. స్త్రీ అస్తిత్వ ప్రకటనలు కూడా. ఇవి ప్రేమగా ప్రేమకే రాసిన లేఖలు. చదువుతున్నంత సేపూ మనలో అద్బుతమైన ప్రేమికులని నిద్రలేపే అక్షరాలు. ఒకసారికే ఆ దాహం తీరదు, మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క లేఖని చదువుకొని మురిసిపోవాలనిపేంచంత అందమైన పుస్తకం ఇది. కడలి రాసిన ఈ పుస్తకాన్ని ఏ వయసులో చదివినా ఆ వయసు వాళ్లకోసమే రాసినట్టుగా అనిపిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Letters to Love - A Collection Of Love Letters
Prioritized by same author, then publisher, then overlapping genre












