Back to Explore
Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
Description
ఇవి రెండూ నా జీవితాన్ని మార్చేసిన కతలు పుస్తకాలు. చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు... కంట కన్నీరు... గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ... ఇంకా ఏం కావాలి నాకు?
'దర్గామిట్ట కథలు' చదివిన పాఠకులు కొందరికి 'పోలేరమ్మ బండ కథలు' తెలియవు. 'పోలేరమ్మ బండ కథలు' చదివిన కొందరికి 'దర్గామిట్ట కథలు' ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను. నమస్కారం.
Plot
దర్గామిట్ట కథలు & పోలేరమ్మ బండ కథలు చిన్న పట్టణాలు, ముస్లిం కుటుంబాలు, మధ్యతరగతి జీవితం, బాల్య జ్ఞాపకాలు, మరియు సాధారణ మనుషుల భావోద్వేగాలను ఆవిష్కరించే కథాసంపుటాలు.
ప్రాంతీయ భాష, స్థానిక సంస్కృతి, ఆహారపు అలవాట్లు, స్నేహాలు, కుటుంబ బంధాలు, మరియు చిన్న చిన్న జీవిత సంఘటనలను రచయిత సహజమైన హాస్యం మరియు భావోద్వేగంతో చిత్రించారు. ఈ కథల్లో మనుషుల మధ్య ఉండే ఆత్మీయత, జ్ఞాపకాల వెచ్చదనం, మరియు జీవన సహజత్వం ప్రధానంగా కనిపిస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre












