Back to Explore
Baamma Cheppina Bangaru Maata
Details
Year2026Pages169LanguageTeluguFormatPaperback, E-bookISBN979-8903303502
Author
PublisherSelf Published
Description
ప్రేమ అంటే ఏమిటి?
బంధం అంటే ఏమిటి?
మనకి దగ్గరైన వాళ్లు…
మనవాళ్లు…
మన సంబంధాలు…
వాటిలో ఉన్నది నిజంగా ప్రేమేనా?
లేక… మనం “ప్రేమ” అని భావిస్తున్నది… స్వార్థమా?
ఈ పుస్తకం ఒక కథలా మొదలవుతుంది…
కానీ క్రమంగా… మనలో మనం ప్రశ్నించుకునే ఒక ప్రయాణంగా మారుతుంది.
ఒక బామ్మ…
ఒక మనవడు…
వాళ్ల మధ్య జరిగే సాధారణ సంభాషణ…ఈ పుస్తకం....
ఇది కేవలం ఆలోచనల పుస్తకం మాత్రమే కాదు…
ఇందులో భావోద్వేగాలు ఉంటాయి…
చిన్న చిన్న నవ్వులు ఉంటాయి…
మనసుని తాకే క్షణాలు ఉంటాయి…
ఈ పుస్తకంలోని ఏదో ఒక పాత్రలో…
ఎక్కడో ఒక చోట…
మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు.
----------
ప్రేమలో… బంధాల్లో… దాగిన సత్యాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం.
Plot
ఈ కథ ఒక బామ్మ మరియు ఆమె మనవడు మధ్య జరిగే మధురమైన సంభాషణ.
ప్రేమ, బంధాలు, అనుబంధాల గురించి బామ్మగారు తన మనవడు సాత్విక్తో చేసే ఈ సంభాషణలో, ప్రతి పాఠకుడు ఏదో ఒక సందర్భంలో తనను తాను గుర్తుచేసుకుంటూ, తన జీవితాన్ని ప్రశ్నించుకునేలా ఉంటుంది.
బామ్మగారి పాత్రలో ఫన్, అమాయకత్వం, భావోద్వేగం, ఫిలోసోఫీ ఇలా అన్ని రకాల భావాలు మిళితమై ఉంటాయి. ఆమె మాటలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, కొన్నిసార్లు కళ్లను కూడా చెమ్మగిల్లేలా చేస్తాయి.
పుస్తకం పూర్తయ్యే సరికి, బామ్మగారు చెప్పిన ప్రేమ, బంధాల గురించి ఉన్న ఆ బంగారు మాటలు పాఠకుడిని తనను తాను ప్రశ్నించుకునేలా చేస్తాయి.
ప్రేమ అంటే ఏమిటి? బంధం అంటే ఏమిటి? మనం నిజంగా ప్రేమిస్తున్నామా, లేక ప్రేమించబడాలని కోరుకుంటున్నామా? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే ప్రయాణంగా ఈ కథ మారుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Baamma Cheppina Bangaru Maata
Prioritized by same author, then publisher, then overlapping genre












