Back to Explore
Kalathapaswi
Description
'కళాతపస్వి'.. ఈ పేరు వినగానే సినిమా అంటే ఇష్టపడే ఎవరికైనా ఒకే ఒక రూపం మనసులో మెదులుతుంది.. ఆయనే ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్రీ కే.విశ్వనాథ్ గారు. ఆ మహానుభావుడికి ఉన్న కోటానుకోట్ల అభిమానులలో(భక్తుడిని అంటే మరింత బాగుంటుందేమో) నేనూ ఒకడిని..
నా పేరు రాకేశ్ బొద్దుల.
విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ఎన్నో అద్భుతమైన సినిమాలను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చూస్తున్న నాలోని అభిమానికి స్వతహాగానే రాసే అలవాటు ఉండడంతో, ఆయన సినిమాలపై కూడా ఎందుకు పుస్తకం రాయకూడదని భావించి వచ్చిన ఆలోచనే నా 'కళాతపస్వి'. విశ్వనాథ్ గారు ఆయన కథలతో చెక్కిన కళాత్మక రూపాలను నాకు తెలిసిన రీతిలో పాఠకుడి కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాను. ఆయన సినిమాల ద్వారా నేర్పించిన విలువలను, సంప్రదాయపు పద్దతులను నా అక్షరాలతో ముడి వేశాను. మొత్తంగా విశ్వనాథ్ గారి అభిమానులు మెచ్చేలా, ఆయన గౌరవం కాపాడేలా, ఆయన అనుసరించిన మార్గాన్ని పది మందికి చూపించే ప్రయత్నం చేద్దామని ఈ పుస్తక ప్రయాణం చేశాను.
కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాత్మక చిత్రాలపై రాసుకున్న కళాతపస్వి పుస్తకాన్ని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి గారు ఇచ్చిన 'ముందుమాట'తో మొదలుపెట్టాను. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎంవీ రఘు గారి చేతుల మీదుగా.. పూర్ణోదయా క్రియేషన్స్, నిర్మాత ఏడిద రాజా గారు, కళాబ్రహ్మ, శిరోమణి, వంశీ ఇంటర్నేషనల్ అధినేత వంశీ రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఈ పుస్తకాన్ని పాఠకుల చెంతకు చేర్చాను. ఆ తర్వాత ఎందరో పెద్దవాళ్ల ఆదరాభిమానాలను పొందాను.. అందులో భాగంగా వంశీ ఇంటర్నేషనల్ అధినేత వంశీ రామరాజు గారి చేతుల మీదుగా "వంశీ-కె.విశ్వనాథ్ కళాతపస్వి జాతీయ పురస్కారం-2025" అందుకున్నానని చెబుతున్నందుకు గర్వపడుతున్నాను.
విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన పది సినిమాల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని, పాటల్లో మాధుర్యాన్ని నాకు అనిపించిన రీతిలో చెప్పాలని.. ఆ చిత్రాలను తరతరాలు గుర్తుంచుకోవాలని ఈ అభిమాని చేసిన చిరు ప్రయత్నమే ఈ 'కళాతపస్వి'. చదివే ప్రతి పాఠకుడికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుందని.. ఇది వారి ద్వారా మరింత ముందుకు వెళ్తుందని మనసారా కోరుకుంటూ...
- మీ రాకేశ్ బొద్దుల
Plot
కళాతపస్వి ఒకే కథను చెప్పే పుస్తకం కాదు. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పది సినిమాలను కేంద్రంగా చేసుకుని వాటిలోని అర్థం, అంతరార్థం, కళాత్మకత, పాటల మాధుర్యం, సంప్రదాయ విలువలు మరియు మానవీయ భావాలను రచయిత తన దృష్టితో విశ్లేషిస్తారు.
సినిమాను ఒకసారి చూసి కథతో పాటు ముందుకు వెళ్లిపోవడం కాకుండా, అదే సినిమాను మరోసారి చూసినప్పుడు దాని వెనుక దాగి ఉన్న కళను కూడా గమనించేలా ఈ పుస్తకం మనల్ని ప్రేరేపిస్తుంది. విశ్వనాథ్ గారి సినిమాలను ఇప్పటికే ప్రేమించే అభిమానులకు, అలాగే ఆయన చిత్రాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకునే సినిమా ఆసక్తిగల పాఠకులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకం చదివిన తర్వాత శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సప్తపది వంటి విశ్వనాథ్ గారి చిత్రాలను మరోసారి చూడాలనిపించేలా, వాటిని కొత్త దృష్టితో పరిశీలించే అవకాశం కల్పిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kalathapaswi
Prioritized by same author, then publisher, then overlapping genre












