Back to Explore
Telugu Logilla Pashu Pakhadula Samajivana Kathalu
Description
నేను ఇప్పుడీ కొట్టంలో వొక మూల పడి వున్నాను. నేను ఇక్కడ ఈసురోమని పడి వున్నాననే సంగతి యెవ్వరూ గమనించరు. నా చుట్టూ వున్న ఈ రొచ్చూ, నా శరీరం మీద వున్న ఈ గోమార్లూ చూశారా? అంతే- చుట్టూ కొంచెం బాగు చెయ్యాలని గానీ, చచ్చేదాకా నా వొళ్లు వీలున్నప్పుడల్లా శుభ్రపరచి నా చావు సుఖవంతం చెయ్యాలని గానీ ఎవ్వరికీ పట్టదు. పైగా చావకుండా ఇంకా ఇక్కడే వున్నానని నా యజమాని మొదలు ఇంటిల్లిపాదీ విసుక్కుంటూ ఉంటారు. నాకు త్వరగా చచ్చిపోవాలనే ఉంది. ఏం చెయ్యనూ? నాకు చావు రాకుండా ఉంది. నన్ను గురించి ఈ మాటే అంటూ ఉంటాడు, బక్క చిక్కి కుక్కి మంచంలో కూర్చుని వుండే నా యజమాని తండ్రి కూడా! ఆ సంగతి తరువాత చెపుతాను.
మెడలోని గంటలను గణగణ మోగించుకుంటూ ఠీవిగా మేత మేస్తున్న ఆ ఎద్దులను చూశారా? మా యజమానికి ఆ ఎద్దులంటే అమిత ప్రేమ. వాటికి జనప కట్టలూ, పచ్చగడ్డి, ఉలవలూ అన్నీ పెడతాడు. పడుకున్నప్పుడు వాటి వంటికి ఎక్కడ గలీజు అంటుకుంటుందోనని ముప్పూటలా శుభ్రం చేస్తాడు. తన సొంత చేతులతో వాటి వొంటిని రోజూ మాలిష్ చేసి నిగనిగలాడేటట్లు ఉంచుతాడు. ఊళ్ళో అందరికీ వాటిని చూపి గర్వపడతాడు.
కాని ఈ మూలపడి ఉన్న నా సంగతి మాత్రం ఆలోచించడు. నా ముందు గడ్డి..............
Plot
తెలుగు లోగిళ్ళ పశు పక్షాదుల సహజీవన కథలు మనుషులు మరియు పశు పక్షుల మధ్య ఉన్న సహజీవన సంబంధాలను ప్రతిబింబించే కథల సంకలనం. గ్రామీణ జీవితంలో జంతువులు, పక్షులు, మరియు మనుషుల మధ్య ఉండే అనుబంధం, నిర్లక్ష్యం, ప్రేమ, మరియు జీవన వాస్తవాలను ఈ కథలు ఆవిష్కరిస్తాయి.
ఒక వృద్ధ ఎద్దు దృష్టికోణంలో చెప్పబడే భావోద్వేగ కథల నుంచి, గ్రామీణ జీవనంలో జంతువుల స్థానం వరకు విభిన్న కోణాలను ఈ సంకలనం చూపిస్తుంది. మనిషి ఉపయోగం ఉన్నప్పుడు ప్రేమించి, అవసరం తీరిన తర్వాత మరిచిపోయే స్వభావాన్ని కథలు సున్నితంగా ప్రశ్నిస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Telugu Logilla Pashu Pakhadula Samajivana Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre








