Back to Explore
Chemistry
Details
Year2025Pages180LanguageTeluguFormatPaperbackISBN978-8198455604
Author
PublisherKadali Writes and Publications
Description
ప్రేమకి నిర్వచనాలెన్నో. కానీ ఈ కథలో ప్రేమను ఒక ప్రయోగశాలకి తీసుకెళ్లాం. బంధాల మధ్య రియాక్షన్లు, రియాక్షన్ల మధ్య బంధాలు – ఇవన్నీ రికార్డు చేసిన ఓ కొత్త ప్రయోగమిది. పారిస్ నుంచి మదనపల్లి వరకు, తిరుపతి మీదుగా సాగే ఈ ప్రయాణంలో ఒక్కో అనుభూతి, ఒక్కో అనుభవం. క్లాస్‌రూమ్‌లో చేసిన అల్లరి, మీ ఫేవరెట్ టీచర్, కాలేజ్ గొడవలు, దోస్తీలు, దూరాలు, దగ్గరితనాలు – ఇవన్నీ ఇందులో ఉన్నాయ్. ఈ నవల మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అంతే ఏడిపిస్తుంది కూడా. చదువుతుంటే, ఎక్కడో ఓ చోట మీకు మీరు ఎదురవుతారు. అప్పటికి మాత్రం ఓ చిరునవ్వు నవ్వి మీకు మీరు హాయ్ చెప్పుకోండి
Plot
ఈ నవల 25 ఏళ్ల తరుణ్ మరియు 22 ఏళ్ల మేరీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఒక రిఫ్రెషింగ్ ప్రేమకథ. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఆ బంధం ఏ విధంగా బలపడింది అనే అంశాలను రచయిత ఎంతో ఆసక్తికరంగా మలిచారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఒకరికొకరు దూరమైన తర్వాత వారి జీవితాల్లో ఎదురైన పరిణామాలు ఏమిటి? కాలక్రమంలో వారు మళ్ళీ కలుసుకున్నారా లేదా? అనే ఉత్కంఠభరితమైన ముగింపుతో ఈ నవల సాగుతుంది.
ప్రొలాగ్:
పండగనెల ప్రారంభం, 2022. మదనపల్లి రైల్వే స్టేషన్.
చీకటి కూడా వణికే జాము, చలి జాలి చూపించడం మానేసే టైము. స్టేషను లోపల ఒక నాన్న తన కూతురికి ధైర్యం చెబుతున్నాడు. స్టేషను బయట ఒక అమ్మ దూరంగా ఉన్న తన కొడుకు చేతికున్న రక్తాన్ని చూసి ధైర్యం కోల్పోతోంది.
డా. శ్రీనివాస్, తన కూతురి బ్యాగునీ, వీలైనన్ని జాగ్రత్తలనీ కలిపి సర్దుతున్నాడు.
"అన్నీ ఉన్నాయి కదరా?" అన్నాడు కూతురుతో.
"యా డాడీ!" అంది శ్రీనివాస్ కూతురు మేరీ శ్రీనివాస్.
"బెడ్ షీట్?"
"ఆ... తీసుకున్నా"
"హ్యాండ్ గ్లోవ్స్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా? అమ్మ ఇచ్చిన నిమ్మకాయలు కింద పడేసావుగా?"
నాన్న చివరి మాటలకు చిరుకోపంతో చూసింది మేరీ.
"డాడ్!".........................
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Chemistry
Prioritized by same author, then publisher, then overlapping genre












