Back to Explore
Anamakuni Atmageetham
Description
కవిత్వం చాలా అంటే చాలా నెమ్మదిగానే చదువుకోవాలి. అందులో యుద్ధ ప్రకంపనలే వున్నా, తుఫాను తుమ్మెదలే హోరెత్తిస్తున్నా సరే! అందులోనూ నరేష్కుమార్ సూఫీ వాక్యాలు మరీ నెమ్మదిగా చదువుకోవాలి. ఇది వొక లాంగ్ మార్చ్ అడుగు తీసి అడుగు వేస్తున్నట్టుగా, వొక్కో అడుగునీ పరీక్షించుకున్నట్టుగా వుంటుంది. నిద్రకి చెల్లుచీటీ ఇచ్చేసిన అర్థరాత్రి కళ్ల మీద వాలే చిమ్మచీకట్లో వొకటి రెండు నక్షత్రాల కన్నీటి చుక్కలు వొలికినట్టుగా కూడా వుంటుంది. తెల్లారుతుంది కదా అమ్మా అని పసికూన దిగాలుగా తల్లి కళ్లలోకి తేరిపార చూసినట్టుగా వుంటుంది. ఇది కవిత్వం కాదేమో, నా ఆత్మకథని వొలిచి చేతికందిస్తున్న కాయితాల కట్ట అనుకుంటాను - ప్రతి కవితా చదివాక. అంతే అంతే కదా! నా కథ తను చెప్తున్నట్టు అనిపించే వాడు కదా కవి! నా డైరీ తను రాస్తున్నాడు అనిపించేది కదా మంచి కవిత్వం అంటే! నరేష్ మీకు ఆ భరోసా! ప్రేమగా తట్టి తట్టి నిరసనగా కోప్పడీ కోప్పడీ అలసటలేకుండా ప్రేమించే భరోసా - కంటి మీద కురిసే వెన్నెల్లాంటిదో, పొద్దున్నే వాలే సూరీడి కిరణంలాంటి పసిదనమో, దాచుకోవాలి దాచుకోవాలి అని ఆశపడే నాలుగు మాటల గుండె చప్పుడో... మీరే చదవండి. కొన్ని అడుగులు నరేష్‌తో కలిసి నడవండి. - అఫ్సర్
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Anamakuni Atmageetham
Prioritized by same author, then publisher, then overlapping genre












