Back to Explore
Thrimurthula Asadharana Kathalu
Details
Year2018Pages150LanguageTeluguFormatPaperbackISBN978-8182940994
Author
PublisherAlakananda Prachuranalu
Description
త్రిమూర్తులు ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును. త్రిమూర్తులు యాదగిరి గుట్ట దారిలోని సురేంద్రపురి నందు బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు. విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు. శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
Plot
త్రిమూర్తుల అసాధారణ కథలు పుస్తకంలో బ్రహ్మ, విష్ణు, మరియు శివుడికి సంబంధించిన అరుదైన పురాణ కథలను సుధామూర్తి సరళమైన శైలిలో చెబుతారు. బ్రహ్మకు ఒకప్పుడు ఐదు ముఖాలు ఎందుకు ఉండేవి? పాములకు చీలిన నాలుక ఎలా వచ్చింది? శివుడు తలపై చంద్రుణ్ని ఎందుకు ధరించాడు? వంటి ప్రశ్నల చుట్టూ కథలు సాగుతాయి.
దేవతలు, శాపాలు, అవతారాలు, మరియు అద్భుత సంఘటనలతో నిండిన ఈ కథలు భారతీయ పురాణాల్లోని తక్కువగా వినిపించే కోణాలను పరిచయం చేస్తాయి.
Books Similar to Thrimurthula Asadharana Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre











