Back to Explore
C/o Bawarchi
Details
Year2022Pages156LanguageTeluguFormatPaperbackISBN9789393764058
Author
PublisherAnvikshiki Publishers
Description
చరణ్ కథలు కొన్ని రంగులతో, గీతలతో మొదలవుతాయేమో! అట్లా కొన్ని రంగులూ, గీతలూ వాక్యాల్లోకి ప్రవహిస్తాయి. పాత్రలుగా ఆకారం దిద్దుకుంటాయి. చరణ్ కాసేపు ఇంప్రెషనిస్ట్, ఇంకాసేపు సర్రియలిస్ట్. కానీ, అతని రంగులూ, గీతలూ మాత్రం నిజానికి రియలిజంలో ఊహలు నేర్చుకుంటాయి. తరవాత చదువుదామని వాయిదా వేసుకుంటూ మొదలు పెడితే, వొక్కో కథా నిలువెత్తు కాన్వాస్ గా మారి, దారికి అడ్డం పడుతుంది. నిలదీసి మరీ తన లోతు కనుక్కోమంటుంది. నాకు తెలిసీ హైదరాబాద్ నగరానికి ఇంతకంటే ఆత్మీయమైన మరో కథకుడు ఉండడేమో! చరణ్ పరిమి అచ్చంగా మెట్రో కథకుడు. స్వచ్ఛంగా కాస్మోపోలిటన్ నగర నివాసి. తనచే సృష్టింపబడిన మనుషులూ, సన్నివేశాలూ మనం రోజూ చూసేవాళ్లే. కానీ, చరణ్ వర్ణరేఖా సమ్మేళనంలో వాళ్ళని కొత్తగా పరిచయం చేసుకుంటాం.
- అఫ్సర్ రచయిత, సంపాదకులు
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు; వివిధ కథల సంకలనం. ఇందులోని “కేరాఫ్ బావర్చి” కథకు హైదరాబాద్ కృష్ణానగర్లో సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన సమయంలో రచయితకు ఎదురైన అనుభవాలు ప్రేరణగా నిలిచాయి.
చరణ్ పరిమి కథల్లో సినిమా రంగం, నగర జీవితం, కుటుంబ సంబంధాలు, సామాజిక పరిస్థితులు వంటి విభిన్న నేపథ్యాలు కనిపిస్తాయి. ఆయన కథలలోని పాత్రలు, సంఘటనలు రోజువారీ జీవితంలో కనిపించే మనుషులను ఆధారంగా చేసుకున్నప్పటికీ, రచయిత ప్రత్యేకమైన దృక్కోణంతో వాటిని కథలుగా మలుస్తారు.
News & Announcements
Books Similar to C/o Bawarchi
Prioritized by same author, then publisher, then overlapping genre












