Back to Explore
Aadavari Matalaku...
Details
Year2025Pages100LanguageTeluguFormatPaperbackISBN978-8198455635
Author
PublisherKadali Writes and Publications
Genres
Description
కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న సంగతులు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపోయే విషయాలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ వివరాలు. ఓ రోజు ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో రోజున తెగ హింస పెడుతుంది. నిన్న బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి చిరాకు పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపు బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్నీ పోగేసి మూట కట్టి ఇదిగో ఇలా మీ చేతికిచ్చాను. కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోండి. ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా అవసరం పడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో, మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందో తెలుసుకున్న రోజున ఈ పుస్తకం మీకు గుర్తొస్తుంది. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.
Plot
ఈ పుస్తకం ప్రధానంగా స్త్రీల అంతరంగ భావాలను, సమాజంలో వారి స్థానాన్ని ప్రశ్నించే కవితల సమాహారం. "సమానమెప్పుడు?" అనే ప్రధాన ప్రశ్నతో సాగే ఈ కవితల్లో, మహిళల కళ్ళలోని కలలు, వారు అనుభవించే మౌన వేదన మరియు సమాజం పట్ల వారి ధిక్కార స్వరాన్ని రచయిత్రి అక్షరబద్ధం చేశారు. అన్నీ ఉన్నవారికి సామాన్యుల లేదా మహిళల "బాధ చప్పుడు" వినిపించదు అనే నిశితమైన విమర్శ ఈ కవితల్లో కనిపిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Aadavari Matalaku...
Prioritized by same author, then publisher, then overlapping genre








