Back to Explore
Rupayi Cheppina Bethala Kathalu
Description
ప్రతి మిడిల్ క్లాస్ మనిషీ ఓ విక్రమార్కుడే. నెలవారి ఖర్చులనే బేతాళుడిని భుజానికి వేసుకుని ప్రయాణిస్తున్నాడు. 'లోటు బడ్జెట్ను అధిగమించడం ఎలా?' అన్నది ఆ మందభాగ్యుడు ఎదుర్కొనే బేతాళ ప్రశ్న. దానికి సరైన జవాబు తెలియాలంటే అరిపిరాల సత్యప్రసాద్ రూపాయి చెప్పిన బేతాళ కథలు చదవాలి. - ఆదివారం ఆంధ్రజ్యోతి మోసాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మదుపు కీకారణ్యంలో, ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకొని డబ్బును ఎలా కాపాడుకోవాలో, కుబేరుడిలా కూర్చుని లాభదాయకమైన వడ్డీ ఎలా సంపాదించుకోవాలో అతి సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పిన ఆర్థిక సూత్రాలే ఈ కథలు - నవ్య వీక్లీ కథల్లోనే ఆర్థిక పాఠాలు నేర్పుతాయి 'రూపాయి చెప్పిన బేతాళ కథలు'. రూపీ బేతాళుడు ఒక కథ చెప్పి అడిగే ప్రశ్నలకి మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పే సమాధానాలే ఇవి. పిసినారిగానో, తినకుండా దాచుకోవాలనో రచయిత చెప్పలేదు. ఆదాయాన్ని ఓ ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. అందరూ చదవాల్సిన పుస్తకం ఇది - సాక్షి ఫండే డబ్బు దాచుకోవడం గురించి, సంపదలు సంతరించుకోవడం గురించి, కథల రూపంలో అరిపిరాల సత్యప్రసాద్ చెప్పిన ఆర్థిక సూత్రాల నిర్వహణ గ్రంధం 'రూపాయి చెప్పిన బేతాళ కథలు'. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలా కాక సరైన ఆర్థిక పాఠాలు అవగాహన లోకి వస్తే బ్యాంకులు, పోస్టాఫీస్లు, చిట్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, బంగారం, రియల్ ఎస్టేట్ ఈ దారులన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆర్థికంగా రుణభారాలు పెరగకుండా అప్రమత్తంగా ఉంటూ, అప్రతిహతంగా బ్రతుకులో ఎలా ఎదగాలి అన్న దానికి ఈ పుస్తకం ఓ గైడ్ ఉపకరిస్తుంది. పైగా ఆర్థిక విషయాలన్నీ కథలు రూపంలో కమనీయంగా మలచి చెప్పడం ద్వారా సత్యప్రసాద్ గారు యువతను ఆకట్టుకునే రచనాసంవిధానంలో విజేతలు అయ్యారని చెప్పవచ్చు. - ఆంధ్రభూమి వారపత్రిక
Plot
ఇది ఒకే కథను అనుసరించే నవల కాదు; మొత్తం 40 ఆర్థిక కథల సంకలనం. పుస్తకం మూడు ప్రధాన భాగాలుగా సాగుతుంది — ఆర్థిక అక్షరాభ్యాసం, ఆదాయ–వ్యయాలు, పొదుపు–మదుపు. మధ్యతరగతి విక్రమార్కుడు సంపద సాధించే దిశగా ప్రయాణిస్తుండగా, బేతాళుడు చెప్పే ప్రతి కథలో ఒక ఆర్థిక ప్రశ్న లేదా పాఠం ఎదురవుతుంది.
కథల ద్వారా సంపాదనను ఎలా నిర్వహించాలి, అవసరమైన ఖర్చులు–అనవసరమైన ఖర్చులను ఎలా గుర్తించాలి, పొదుపును ఎలా అలవాటుగా మార్చుకోవాలి, అలాగే సేవింగ్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి ఆర్థిక అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను పరిచయం చేస్తుంది. పుస్తకం చెప్పే ప్రధాన భావన సంపాదనను కేవలం ఖర్చు చేయడం కాకుండా, దాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి సంపదగా మార్చుకునే దిశగా ఆలోచించడం.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Rupayi Cheppina Bethala Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre












