Back to Explore
Edadugulu
Description
ఇటు వివాహబంధం, అటు ప్రేమ సాంగత్యంలో పడిపోయి ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్న కథానాయకి నియతి సందిగ్ధావస్థను అద్భుతంగా విశ్లేషించిన నవల. కొత్తని ఆహ్వానించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. - స్వర్ణకిలారి. వస్తువు పరంగా బుగ్గలు నొక్కుకునే జీవితకథ, అయినా ఇందులో కంటికి కనిపించనవి, లోతుగా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇది ఒక విప్లవాత్మక రచన. ఈ కథా వస్తువు అంత ఈజీగా కొరుకుడుపడదు. తరచి తరచి చదవాలి. -మణి వడ్లమాని. *Dual and multiple relationships గురించి చాలా చర్చ జరగాల్సి వుంది. Morally wrong and emotionally right! సమాజ కట్టుబాట్లలో పడి లా ఆఫ్ నేచర్ని ignore చేస్తున్నామా! మనం create చేసుకున్న boundariesని కాలం గడుస్తున్న కొద్దీ మనమే break చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక ఇలాంటి introspections ఎప్పుడూ స్త్రీలకే ఎందుకుంటాయో!
- ఝాన్సీ పాపుదేశి
Plot
నియతి నందు భార్య. అదే సమయంలో శశాంక్ ఆమె ప్రేమికుడు. ఈ రెండు సంబంధాల మధ్య ఆమె జీవితం సాగుతుండగా, తన భర్తకు ఈ విషయం తెలిసిపోతుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతుంది. మరోవైపు శశాంక్ తనను నిజంగా ప్రేమిస్తున్నాడా అనే సందేహం కూడా ఆమెను కలవరపెడుతుంది. ఒక సంబంధాన్ని వదిలి మరొకదాన్ని ఎంచుకోవాలా, లేక రెండింటినీ కొనసాగించగలమా అనే ప్రశ్నలతో నియతి తనలో తాను సంఘర్షణ పడుతుంది.
కథ ముందుకు సాగేకొద్దీ నిజాన్ని చెప్పడం, దాన్ని దాచడం, ప్రేమకు–వివాహానికి మధ్య ఉన్న తేడా, సమాజం నిర్ణయించే నైతికత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ సంఘర్షణ చివరకు నియతిని వరుస నిర్ణయాల వైపు నడిపిస్తుంది. నవల ఏడు “అడుగులు”గా సాగి ముగింపుకు చేరుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Edadugulu
Prioritized by same author, then publisher, then overlapping genre












