Back to Explore
Bahuda Bathuku Kathalu
Details
Year2022Pages150LanguageTeluguFormatPaperbackISBN978-9393764164
Author
PublisherAnvikshiki Publishers
Description
రిపబ్లిక్ క్రియేటివ్ ప్రొడ్యుసర్ సతీష్ ఈ కధా సంపుటిని నాకందించి, దీన్ని చదివి మీకు నచ్చితే ముందుమాట రాయండి అని కోరారు. అప్పడప్పుడూ నా దగ్గరకు వచ్చిపోయే పరిపక్వతలేని మరొక రాతేమోలే అని చాలా రోజులు చదవకుండా నిర్లక్ష్యంగా వదిలేశాను. నా తదుపరి సినిమా రాతలో బిజీగా ఉండిపోయాను. ఇందుకు కారణం నాలో ఉన్న మరో బలహీనత. ఏ పుస్తకాన్నైనా చాలా మెల్లగా చదువుతాను. చిన్నప్పట్నుంచి సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు నాన్ - ఫిక్షన్ పుస్తకాలు చదవడమే అలవాటు! సతీష్ మరీ మరీ అడగడంతో చదవడం మొదలుపెట్టి, రెండు రోజుల్లో పూర్తి చేశాను. ఇందుకు కారణం రచయిత సుదర్శన్ రచనా శైలి. చదువుతున్నంతసేపూ నా చుట్టూ ఉన్న ప్రపంచం, నా జీవితంలో ఎదురైన పాత్రలే కళ్ళకు కనిపించాయి. ఇవన్నీ మన కథలే అనిపించాయి. పాత్రల మనోభావాలు, వాళ్ళ స్థితిగతులు మన జీవితంలో ఎదురైనవిగానే అనిపించాయి. ఈ పుస్తకాన్ని ప్రశాంతంగా మనతో మనం ఉన్నప్పుడు, మనలో మనం చదువుకుంటే, మనల్ని మనకు గుర్తు చేస్తుంది.
- దేవా కట్టా
Plot
ఈ పుస్తకంలో మొత్తం 20 కథలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా బహుదా నది పరివాహక ప్రాంతంలోని పది గ్రామాల చుట్టూ తిరుగుతాయి.
మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఉండే వివిధ దశలను, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొనే కష్టాలను, వారి జీవన విధానాన్ని ఈ కథలు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Bahuda Bathuku Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre











