Back to Explore
Cine Robinhoods Sira 2.0
Details
Year2025Pages210LanguageTeluguFormatPaperbackISBN978-9348912763
Author
PublisherAnvikshiki Publishers
Description
Advocate Ram Duvvuri (For Police And Film Industry) "యువరానర్, సినీ రాబిన్ హుడ్స్ వెబ్సైట్లో వీళ్ళకో ట్యాగ్ ఉంది. “రోటీ కప్ డా మకాన్ ఔర్ సినిమా" అని. అంటే తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, ఉంటానికి ఇల్లు ఎలాగో చూడ్డానికి సినిమా లేకపోతే చచ్చిపోయే జాతి మనది అని చెప్తున్నారు వీళ్ళు. నిజంగా మన జాతి అదే అయితే, ఒక్కసారి అందరం కళ్ళుమూసుకుని రెండు నిముషాలు మౌనం పాటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఒక జాతిగా చచ్చిపోయి డెబ్భై ఎనిమిదేళ్ళయింది కాబట్టి.” Advocate Manohar Murthy (Defending SIRA) “తిండి, బట్ట, ఇల్లు లేని పేదవాడు కూడా ఒక సినిమా చూసి రెండుగంటలపాటు, కనీసం సినిమా పోస్టరుముందు నిల్చుని రెండునిముషాలపాటు ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్ళి అక్కడో హీరోగా తనను తాను ఊహించుకుని ఆనందపడి మళ్ళీ తన జీవితంలోకి వొచ్చి పడతాడు. అదీ సినిమా గొప్పతనం. అందుకే 'రోటీ కప్ డా మకాన్ ఔర్ సినిమా' అన్నది.. ఒక నిత్యావసర వస్తువుని ధనికుల విలాసవస్తువుగా మార్చేశారు వీళ్ళు.
Plot
Cine Robinhoods Sira 2.0 కథ “Cine Robinhoods” అనే ఒక గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. “రోటీ, కపడా, మకాన్ ఔర్ సినిమా” అనే నినాదంతో సినిమా ప్రతి మనిషికి అవసరమైన హక్కు అని భావించే ఈ గ్రూప్ చర్యలు వివాదానికి దారి తీస్తాయి.
ఈ వ్యవహారం కోర్టుకు చేరిన తర్వాత, పోలీస్ మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అడ్వకేట్ రామ్ దువ్వూరి వాదిస్తాడు. మరోవైపు, SIRA తరఫున అడ్వకేట్ మనోహర్ మూర్తి తన వాదనలు వినిపిస్తాడు.
సినిమా ఒక అవసరమా? లేక విలాసమా? అనే ప్రశ్న చుట్టూ సాగిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, సినిమా మరియు సామాన్య ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని చర్చిస్తుంది.
Books Similar to Cine Robinhoods Sira 2.0
Prioritized by same author, then publisher, then overlapping genre











