Back to Explore
Kunderu Sakshigaa
Details
Year2025Pages170LanguageTeluguFormatPaperbackISBN978-9348912220
Author
PublisherAnvikshiki Publishers
Description
కొత్త తరం రచయితల్లో సురేంద్రది ఒక ప్రత్యేక శైలి. మూడేళ్లలో మూడు పుస్తకాలు ప్రచురించి సాహిత్య ఎకాడమీ యువ పురస్కార్క రెండు సార్లు నామినేట్ అయ్యి, ఈ తరం రచయితల్లో ముందు వరసలో నిలబడ్డాడు సురేంద్ర. రాయలసీమ మట్టి పరిమళం, స్థానిక భాషా సౌందర్యం, మానవ సంబంధాల సంక్లిష్టతను అద్భుతంగా మిళితం చేస్తూ రచనలు చేస్తున్న సురేంద్ర శీలం రెండవ నవల “కుందేరు సాక్షిగా!” క్రిష్టిపాడు అనే గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని, తరాలుగా సాగే ఆధిపత్య పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నరసింహస్వామి ఆలయ భూమి చుట్టూ అల్లుకున్న రాజకీయం, గ్రామాధికారం కోసం నారపురెడ్డి, తిమ్మారెడ్డి వర్గాలు చేసే కుయుక్తులను తనదైన శైలిలో ఈ నవలలో చిత్రించాడు. అయితే, ఈ రాజకీయ జ్వాలల మధ్య, డాక్టర్ చదువుతున్న ప్రభాకర్, రికార్డింగ్ డాన్స్ కళాకారిణి శ్రావణిల నిస్వార్థమైన ప్రేమ చిగురిస్తుంది. వారి ప్రేమకు సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అన్యాయాలు మరియు కుల-వర్గ విభేదాలను ఈ నవల ప్రశ్నిస్తుంది. శ్రావణి 'మర్యాద' గురించి, ప్రభాకర్ తన 'సామాజిక బాధ్యత' గురించి చేసే పోరాటాలు కథకు జీవం పోస్తాయి. ఈ నవలలో గుర్రన్న వంటి పాత్రల స్నేహం, శేఖర్ వంటి ఆదర్శవంతమైన వ్యక్తులు చూపిన ఆశయం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. తన ప్రాంతంలోని సాధారణ మనుషులు, వారి ఆశలు, నిస్సహాయతలు, ఎత్తు పల్లాలను కథలో నిలబెట్టడంలో సురేంద్ర చేసిన కృషి అభినందనీయం. రూరల్ నవలలకు పేరుగాంచిన కేశవరెడ్డి గారి శైలికి వారసత్వాన్ని అందిస్తూ, సురేంద్ర శీలం, తెలుగు రాష్ట్రాల సాహిత్యాభిమానుల గుండెల్లో బలంగా నాటుకునే నిజమైన మట్టి కథను సృష్టించారు. ఈ నవలలోని ప్రతి పేజీ గ్రామీణ జీవన చిత్రణకు, భావోద్వేగాల తీవ్రతకు నిదర్శనం.
Plot
కుందేరు సాక్షిగా నవల క్రిష్టిపాడు గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుంది. నరసింహస్వామి ఆలయ భూమిని చుట్టుముట్టిన గ్రామ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, మరియు నారపురెడ్డి - తిమ్మారెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలు కథకు ప్రధాన నేపథ్యంగా నిలుస్తాయి.
ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య డాక్టర్ చదువుతున్న ప్రభాకర్ మరియు రికార్డింగ్ డాన్స్ కళాకారిణి శ్రావణి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కుల, వర్గ, మరియు సామాజిక అవమానాల మధ్య తమ వ్యక్తిత్వం మరియు గౌరవం కోసం వారు చేసే పోరాటం కథను ముందుకు నడిపిస్తుంది.
గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు, స్నేహం, మరియు సామాజిక అసమానతలను రాయలసీమ భాషా సౌందర్యంతో ఈ నవల చిత్రిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Kunderu Sakshigaa
Prioritized by same author, then publisher, then overlapping genre











