Back to Explore
Nenu ekkada unnanu?
Details
Year2025Pages145LanguageTeluguFormatPaperbackISBN978-9348912367
Author
PublisherAnvikshiki Publishers
Description
“నేను ఎక్కడ ఉన్నాను?” అనేది కేవలం ఆశ అనే ఒక అమ్మాయి వ్యక్తిగత కథ మాత్రమే కాదు. ఇది ఆధునిక భారతీయ సమాజంలో ముఖ్యంగా 90లలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత వచ్చిన మార్పుల ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలు అనుభవించిన ఒక సాంఘిక, మానవ సంబంధాల సంఘర్షణకు అక్షర రూపం. అమెరికా వెళ్లి స్థిరపడాలనే కోరిక ఒక సాధారణ ఆశయంగా మారిన నేపథ్యంలో, ఆ నిర్ణయం ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఎలా మలుపు తిప్పుతుంది? వ్యక్తిగత, కుటుంబ బంధాలలో ఏమేమి కోల్పోయేలా చేస్తుందనే వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమే ఈ రచన. రచయిత ఈ కథ ద్వారా అమెరికా వెళ్లడం మంచిదా కాదా అని చెప్పడం లేదు. కానీ, ఆర్థిక స్థిరత్వం కోసం బంధాలు, విలువలు, నైతికత వంటి వాటితో రాజీ పడాల్సిన పరిస్థితులను, తమ కన్నవారి నుంచి దూరం కావడం వల్ల కలిగే మానసిక ఒంటరితనాన్ని ఈ కథ బలంగా ఆవిష్కరిస్తుంది. వివిధ వ్యక్తుల నిజ జీవిత అనుభవాలను ఆధారంగా చేసుకుని, కొంత కల్పనతో మలిచిన ఈ పుస్తకం, ఆలోచనలను రేకెత్తించే ఒక సామాజిక విశ్లేషణ.
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Nenu ekkada unnanu?
Prioritized by same author, then publisher, then overlapping genre












