Back to Explore
Evaru
Details
Year2024Pages220LanguageTeluguFormatPaperbackISBN978-9395117807
Author
PublisherAnvikshiki Publishers
Description
1980, 90లలో ఎన్నో తెలుగు నవలలు సినిమాలుగా వచ్చాయి. గత పాతికేళ్లలో అలాంటి ప్రయత్నాలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం తెలుగులో నవలలు రాసే రచయితలు పూర్తిగా తగ్గిపోవడం. కానీ మేము నిర్వహించిన ఉగాది నవలల పోటీ ద్వారా మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరగాలని మేము ఆశించాం. ఆ ఆశ “ఎవరు" లాంటి నవలతో తీరుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో క్రైం నవలలు పూర్తిగా అంతరించిపోయిన ఈ సమయంలో మర్డర్ మిస్టరీ ప్రధానంగా సాగుతూ, ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు కథనంలో వాడుతూ వచ్చిన ఆసక్తికరమైన నవల “ఎవరు.” ఒక విహారయాత్రకు వెళ్లి, గుర్తుగా అక్కడ ఫోటో తీసుకున్న ఆరుగురు స్నేహితులు, ఆ ఫోటోలో వాళ్లు నిల్చున్న వరుసలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. వీళ్ల మరణానికి కారణం ఎవరు? బ్లాక్ బస్టర్ సినిమాకో, సీరీస్్క కావాల్సిన కథనంతో, మొదలుపెడితే చివరి పేజీ వరకూ ఆపకుండా చదివించే పేజ్ టర్నర్ ఈ నవల. మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇంతటితో కథంతా ఒక కొలిక్కి వచ్చేసిందని ఊపిరి పీల్చుకునేలోగా మరొక కొత్త ట్విస్ట్‌లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్, క్రైం నవలలు ఇష్టపడే ఎవరికైనా తప్పక నచ్చుతుంది.
Plot
ఆరుగురు స్నేహితులు ఒక విహారయాత్రలో భాగంగా ఒకచోటికి వెళ్లి, తమ జ్ఞాపకంగా ఒక ఫొటో తీసుకుంటారు. అయితే ఆ ఫొటో వారి జీవితాల్లో ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. ఫొటోలో వారు నిల్చున్న క్రమంలో ఒక్కొక్కరు వరుసగా హత్యకు గురవుతారు. వారి మరణాల వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ హత్యలకు సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించే క్రమంలో కథలో అనేక అనూహ్యమైన ట్విస్టులు చోటుచేసుకుంటాయి.
సాంకేతికత, ముఖ్యంగా AI మరియు డీప్‌ఫేక్ వంటి అంశాలు కథలో భాగం కావడంతో సాధారణ క్రైమ్ మిస్టరీకి సమకాలీన సాంకేతిక నేపథ్యం జతచేయబడింది. ప్రతి మలుపు తర్వాత మరో కొత్త అనుమానం, మరో కొత్త రహస్యం ఎదురవుతూ చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే విధంగా కథనం సాగుతుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Evaru
Prioritized by same author, then publisher, then overlapping genre












