Back to Explore
Pellipustakam
Details
Year2024Pages120LanguageTeluguFormatPaperbackISBN978-9395117906
Author
PublisherAnvikshiki Publishers
Description
ఈ తరం యువతీయువకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పెళ్లి విషయంలో ఆడదాని అందచందాలను గానీ, మొగవాడి ధనాన్ని గానీ ప్రధాన ప్రమాణాలుగా పరిగణించకూడదు. ఎందుకంటే, ఈ రెండూ చాలా అశాశ్వతమైనవి. అవసరానికి మించిన సంపద అనర్థాలకే దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. డబ్బు ఎంత ఎక్కువగా వచ్చినా, దానితో తృప్తి చెందకపోవడం ఆందోళనకరమైన విషయం. యువతరం అలవరచుకోవాల్సిన అత్యంత కీలకమైన సుగుణాలలో తృప్తి ఒకటి. తమకు లభించే ఆదాయంతో తృప్తిగా జీవించగల దంపతులు ఎప్పటికీ విడిపోరు. ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్న నలుగురు అమ్మాయిల జీవితాలను కథనం చేసిన నవల ఇది. కాలేజ్ తర్వాత అందరూ ఒక్కోదారిలో వెళ్లిపోయినా తమ జీవితాల్లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ తమలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలబడి స్నేహానికి ఉన్న విలువలను తెలియచేసిన నవల. అలాగే డబ్బు, అందం శాశ్వతం కాదుబీ ఒకరికోసం మరొకరు తోడుగా నిలబడడంలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పే సందేశాత్మక నవల 'పెళ్లి పుస్తకం. '
Plot
ఇంజనీరింగ్ కాలేజీలో స్నేహితులైన నలుగురు అమ్మాయిలు చదువు పూర్తయ్యాక వేర్వేరు జీవితాల్లోకి అడుగుపెడతారు. దూరంగా ఉన్నప్పటికీ తమ మధ్య స్నేహాన్ని కొనసాగిస్తూ, ఒకరి జీవితంలో ఎదురయ్యే సమస్యలను మరొకరు చర్చించుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో అందం లేదా డబ్బును ప్రధాన ప్రమాణాలుగా చూడటం కంటే, పరస్పర అవగాహన, సంతృప్తి, సహకారం మరియు కలిసి జీవించగల సామర్థ్యం ముఖ్యమనే భావన కథలో ముందుకు వస్తుంది.
నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగే సంఘటనల ద్వారా డబ్బు, అందం వంటి అంశాలు శాశ్వతమైనవి కావని, జీవిత భాగస్వాములు ఒకరికొకరు తోడుగా నిలబడటంలోనే కుటుంబ జీవితానికి సంబంధించిన నిజమైన విలువ ఉందనే సందేశాన్ని నవల అందిస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Pellipustakam
Prioritized by same author, then publisher, then overlapping genre












