Back to Explore
Radha Madhavam
Description
మీకిది తెలుసా ఈ జగత్తు మొత్తం దేనితో నిండిపోయి ఉందో? మీకిది తెలుసా ప్రపంచంలో బంధాలు ఎలా నిలుస్తాయో? లోకమంతా మహా మహిమాన్విత రాధారాణి ప్రేమే నిండి ఉంది. ఏ బంధం నిలవాలన్నా ఆ కరుణామూర్తి దయ వల్లనే జరుగుతుంది. మనుషుల్లో కోపం, కక్ష, ద్వేషం, అసూయ, ప్రతీకారాలు ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. వాటన్నిటినీ చేధించడం చాలా కష్టతరమైన పని. నిత్యం మనిషి ఆలోచనలు స్వంత లాభాల కొరకు పరిపరి విధాల పరుగులు తీస్తుంటాయి. ఏదో సాధించేయాలని కుళ్ళు కుతంత్రాలతో కుట్రలు పన్నడంలో మనిషి మెదడు ఆరితేరిపోయింది. వాటిలో పడి అసలైన సంపదను కాలదన్నుతున్నాడు. విశ్వమంతా వ్యాపించిన ప్రేమను మనిషి మాంసపు కళ్ళతో చూడలేకపోతున్నాడు. రాధారాణి నామస్మరణ మాత్రం చేతనే మనిషిలో అల్లుకుపోయిన అజ్ఞానం కూలిపోయి, ప్రేమ ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రకృతికి మూలకారణం రాధారాణి. అతి త్వరలో రాధారాణి గాథలు, శ్రీ రాధాకృష్ణుల ప్రేమ జ్ఞాపికలు మరెన్నో రాసేందుకు సిద్ధంగా ఉంటాను.... కృష్ణదాసి (లలిత)
Plot
No plot available for this book.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Radha Madhavam
Prioritized by same author, then publisher, then overlapping genre












