Back to Explore
Parveta Kathalu
Details
Year2022Pages140LanguageTeluguFormatPaperbackISBN978-9395117104
Author
PublisherAnvikshiki Publishers
Description
PARVETA Short stories by Surendra Seelam తెలుగు, సురేంద్ర ఈ కథలను హృదయంతో రాసాడు. ఇంపైన మాండలికంలో సరళంగా కథలను నడిపిన నేర్పు, చిక్కనైన కథనం, ఎంచుకున్న కథా వస్తువులు ఈ పుస్తకాన్ని తెల సాహిత్యంలో నిలబెడతాయని నేను నమ్ముతున్నాను. నాలుగేళ్ళుగా నేనెరిగిన సురేంద్ర కాలానికి నిలబడే ఇటువంటి కథలను చెప్తుంటే... అందరికంటే ఎక్కువ సంతోషం నాకే కలుగుతోంది. ఈ కథలన్నీ నాకిష్టం. సురేంద్ర సాహిత్యంలో, సినిమాల్లో బలమైన అడుగులు వేయడానికి ఈ పుస్తకం నాంది - కరుణకుమార్ రచయిత, దర్శకుడు.
ఆన్వీక్షికి మొదలుపెట్టిన సమయంలోనే సురేంద్ర కథలు రాయడం మొదలు పెట్టాడు. ఈ మూడేళ్ళలో సురేంద్ర పూర్తి స్థాయి కథకుడిగా ఇవాల్వ్ కావడం నేను కళ్లారా చూశాను. 2019లో ఒక్క పుస్తకంతో మొదలైన ఆన్వీక్షికి మూడేళ్ళు పూర్తయ్యేసరికి వంద పుస్తకాలు ప్రచురించింది. ఆన్వీక్షికి చేసే ప్రతి పనిలోనూ మాకు ఎంతో సహాయకారిగా ఉంటూ వచ్చిన సురేంద్ర ఇప్పుడు తన 12 కథల పుస్తకం 'పార్వేట'ని ఆన్వీక్షికి ప్రచురించడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్తతరం రచయితలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మొదలు పెట్టిన లక్ష్యం ఈ పుస్తకంతో నెరవేరినట్టనిపిస్తోంది. ఇంతమంచి కథల పుస్తకాన్ని ఆన్వీకి ద్వారా తెలుగు సాహితీ ప్రపంచానికి పరిచయం చేయడం గర్వంగా ఉంది - వెంకట్ శిద్దారెడ్డి
Plot
పార్వేట పుస్తకంలో గ్రామీణ జీవితం, మానవ సంబంధాలు, సామాజిక అసమానతలు, మరియు సాధారణ మనుషుల భావోద్వేగాలను ప్రతిబింబించే 12 కథలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత భాష, జీవనశైలి, మరియు గ్రామీణ వాస్తవాలను సహజంగా చూపిస్తూ ప్రతి కథ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
స్నేహం, పేదరికం, గౌరవం, ప్రేమ, మరియు మనిషి అంతర్మథనం వంటి అంశాలను సరళమైన కానీ భావోద్వేగపూరితమైన కథన శైలిలో రచయిత ఆవిష్కరించారు.
Books Similar to Parveta Kathalu
Prioritized by same author, then publisher, then overlapping genre











