Back to Explore
That Last Melody
Details
Year2024Pages150LanguageTeluguFormatPaperbackISBN978-9395117524
Author
PublisherAnvikshiki Publishers
Description
కళాకారులకు, ముఖ్యంగా రచయితలకు ప్రేమ ఎప్పటికీ అక్షయపాత్ర లాంటిది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో చాలావరకు ప్రేమ కథలే. 21 సంవత్సరాల భవ్య తెలుగు సాహిత్యంలో తన ప్రయాణాన్ని ఒక ప్రేమ కథతో ప్రారంభించింది. సంక్లిష్టమైన కథనంతో, కథలో మరో కథని అల్లుతూ చేసిన నిర్మాణం ఆకట్టుకుంటుంది. మన స్వంత ప్రేమ విషయంలో మనం గుడ్డివాళ్లం. కానీ ఇతరుల ప్రేమ కథల ద్వారానే మనం ప్రేమ గురించి తెలుసుకుంటాం. అలాంటి రెండు ప్రేమకథలను ఈ నవల ద్వారా భవ్య మన ముందుంచింది. అయినా పాఠకులను ఎక్కడా గందరగోళపరచకుండా కథను నడిపించగలిగిన నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంది. ప్రేమ కేవలం వ్యక్తుల మధ్యే కాదు, కాలాలు, దూరాల మధ్య కూడా సేతువుగా మారగలదని నిరూపించే ప్రయత్నం ఈ “దట్ లాస్ట్ మెలడీ”. తెలుగు సాహిత్యంలో కొత్త ఊపిరిని నింపే ఈ నవలను చదవడం మిస్ కాకండి!
Plot
కథ సాన్ జోస్లోని వాలెన్బర్గ్ పార్క్లో ప్రారంభమవుతుంది. సారా ఒక టీవీ జర్నలిస్టు. ఆమె ప్రియుడు విష్ణు ఒక చిన్న పత్రికలో విలేఖరిగా పనిచేస్తుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ జీతం, పెళ్లి వంటి విషయాలపై చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి.
ఇలాంటి సమయంలో సారా తన వృత్తిలో భాగంగా రచయిత సత్య రాసిన “షోనా” అనే పుస్తకాన్ని చదవాల్సి వస్తుంది. ఆ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో అందులోని కథను, ముఖ్యంగా రిషి–సత్య పాత్రల సంబంధాన్ని, తన స్వంత ప్రేమ జీవితంతో సారా పోల్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇతరుల ప్రేమకథను చదువుతూ తన ప్రేమ, తన సంబంధం, పెళ్లి గురించి సారా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక సారా–విష్ణుల ప్రేమ చివరకు పెళ్లిగా మారుతుందా? “షోనా”లోని కథ సారా ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రేమలో మారే ప్రాధాన్యతలు వారి సంబంధాన్ని ఎటువైపు తీసుకెళ్తాయి? అనే ప్రశ్నలకు సమాధానమే నవలలోని ప్రధాన కథనం.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to That Last Melody
Prioritized by same author, then publisher, then overlapping genre












