Back to Explore
Nadoori Midde
Details
Year2024Pages148LanguageTeluguFormatPaperbackISBN9788-198222152
Author
PublisherAnvikshiki Publishers
Description
పాఠకుడిగా మొదలై, కథకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సురేంద్ర ఇప్పుడు నవలాకారుడిగా మన ముందుకు రావడం ఎంత మాత్రమూ యాదృచ్ఛికం కాదేమో అనిపిస్తుంది. ఒక కథకుడిగా రాయలసీమ జీవన కథల్ని 'పార్వేట' కథా సంపుటిని మన ముందుకు తెచ్చినప్పుడు చాలా ప్రామిసింగ్ గా కనబడ్డ సురేంద్ర ఇప్పుడు 'నడూరి మిద్దె' నవలతో తన ప్రాంత సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవన వైషమ్యాలను చిత్రం కట్టి బాధ్యత ఎరిగిన రచయితగా తనను తాను మలుచుకోవడం గమనించాను. ఇది కదా ఒక కళాకారుడుకి ఉండవలసిన ప్రధాన లక్షణం. కళ యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే. 'నడూరి మిద్దె' కేవలం ఒక నవల మాత్రమే కాదు ఇది మారుతున్న భారతదేశపు చిత్రపటం. దళిత జీవితాల పోరాట గాథ, మానవ సంబంధాల సున్నితత్వం, కులమత భేదాలకు అతీతమైన స్నేహబంధాల కథనం. గ్రామీణ యాసలో రాసినప్పటికీ, సురేంద్ర భాష కవిత్వంలా ప్రవహిస్తుంది. పెద్దిరెడ్డి, శాంతి, సిన్నోడు వంటి పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజపు ముఖచిత్రాలు. గ్రామీణ జీవన చిత్రణ, కుల వ్యవస్థ సవాళ్ళు, పేదరికంతో పోరాటం వీటన్నిటినీ సమన్వయం చేస్తూ సురేంద్ర ఒక గొప్ప నవలను ఆవిష్కరించాడు. ఈ నవల కేవలం కథ చెప్పడమే కాదు - జీవితాన్ని అన్వేషిస్తుంది. దుఃఖంలో దాగిన చీకటిని, పోరాటంలో దొరికే వెలుగును, మనుషుల మధ్య ఉండే ఆత్మీయత - ఇవన్నీ పాఠకుల హృదయాలను తాకుతాయి. మానవ జీవితంలో ఉన్న సహజీవన సౌందర్యాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడం, తోటి వారి జీవన ఆహారపు అలవాట్ల పట్ల రచయిత సునిశిత దృష్టి మనకు ఈ నవలో కనిపిస్తాయి. ''నడూరి మిద్దె' ప్రతి తెలుగు పాఠకుడూ తప్పక చదవాల్సిన నవల. -మహి బెజవాడ
Plot
నడూరి మిద్దె గ్రామీణ జీవితంలోని సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ అసమానతల మధ్య సాగిపోయే కథ. దళిత జీవితాల పోరాటం, మానవ సంబంధాల సున్నితత్వం, మరియు కులవ్యవస్థ ప్రభావం కథలో ప్రధానంగా కనిపిస్తాయి.
పెద్దిరెడ్డి, శాంతి, సిన్నోడు వంటి పాత్రల ద్వారా గ్రామీణ సమాజంలో ఉన్న అధికారం, పేదరికం, స్నేహం, మరియు సహజీవన సంబంధాలను నవల ఆవిష్కరిస్తుంది. ప్రేమ, గౌరవం, మరియు మనిషి తన స్థానం కోసం చేసే అంతర్మథనం కథలో భావోద్వేగ తీవ్రతను తీసుకువస్తాయి.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to Nadoori Midde
Prioritized by same author, then publisher, then overlapping genre











