Back to Explore
Meka Bathuku
Details
Year2024Pages200LanguageTeluguFormatPaperbackISBN978-9395117975
Authors
PublisherAnvikshiki Publishers
Description
మీరీ పుస్తకాన్ని చదవరు. మీ కళ్ళముందు మీరెప్పుడూ కనని, వినని కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంతకంటే నరకం ఇంకేం ఉంటుందని మీరు ఏడుస్తారు. మీకు ఆకలి విలువ తెలుస్తుంది. నీటి విలువ తెలుస్తుంది. మీకు మాట విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైనది ఈ భూమ్మీద ఇంకేం లేదని తెలుసుకున్నాక, మీరు ఘోర సమస్యలనుకుంటున్నవన్నీ గోరంతవే అన్న సత్యం బోధపడ్డాక, మీరీ పుస్తకాన్ని మూసి – ఆ కథానాయకుడికీ, ఆ కథారచయితకీ కృతజ్ఞతలు చెప్తారు. గ్యారంటీ! మలయాళంలో వందకుపైగా పునర్ముద్రణలు పొంది చరిత్ర సృష్టించిన పుస్తకం. ఏడు భాషల్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కాపీలు అమ్ముడైన సంచలన పుస్తకం. ఐదు భాషల్లో రిలీజై 150 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాకి కథను అందించిన పాపులర్ పుస్తకం. అదే- బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్' గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'.
Plot
నజీబ్ మహమ్మద్ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనే ఆశతో సౌదీ అరేబియాకు వెళ్తాడు. అయితే అక్కడ అతని జీవితం ఊహించని మలుపు తిరిగి, ఎడారిలోని ఒక ఫారంలో మేకలను కాచే పనికి బలవంతం చేయబడుతుంది. ఆహారం, నీరు, మానవ సంబంధాలు లేకుండా తీవ్రమైన ఒంటరితనం మరియు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ నజీబ్ తన స్వేచ్ఛను కోల్పోతాడు. చివరకు ప్రాణాలను పణంగా పెట్టి ఆ ఎడారి చెర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. అతని ప్రయాణం వలస కార్మికుల కష్టాలు, మనుగడ, స్వేచ్ఛ, ఆశ మరియు మానవ సహనానికి ప్రతీకగా నిలుస్తుంది.
News & Announcements
Aadujeevitham
బెన్యామిన్ రచించిన Aadujeevithamకు Kerala Sahitya Akademi Award for Novel (2009) మరియు Abu Dhabi Sakthi Award (2008) లభించాయి.
Goat Days
జోసెఫ్ కోయిప్పల్లి చేసిన Goat Days ఆంగ్ల అనువాదం 2012 Man Asian Literary Prize Longlistలో, 2013 DSC Prize for South Asian Literature Shortlistలో చోటు సంపాదించింది.
Books Similar to Meka Bathuku
Prioritized by same author, then publisher, then overlapping genre












