Back to Explore
OOBILO DUNNA
Description
అరవై ఏళ్ల క్రితం తొలిసారిగా ప్రచురించబడి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక తుఫాన్ వంటి ప్రభావాన్ని సృష్టించిన వినుకొండ నాగరాజు రచించిన 'ఊబిలో దున్న' నవల, ఇప్పుడు 2025 స్పెషల్ ఎడిషన్ రూపంలో తిరిగి పాఠకుల ముందుకొస్తుంది. ఈ నవల కేవలం కాలక్షేపం కోసం చదివే ప్రేమ కథ కాదు. ఇందులో ప్రధానంగా, ఒక మనిషి బురద ఊబిలో కూరుకుపోయిన దున్నపోతును రక్షించడానికి చేసే మహత్తరమైన, ధృఢమైన ప్రయత్నాన్ని చిత్రీకరించారు. ఈ కథ కేవలం దున్నపోతు గురించి కాదు. ఈ ఊబి, నేటి సమాజం రాజకీయంగా, పరిపాలనాపరంగా చిక్కుకుపోయిన ప్రతిష్టంభనకు సంకేతం. ఈ ప్రతిష్టంభన నుంచి లంటే ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను గుర్తించి, నిర్ణయాత్మక ప్రయత్నాలు చేయాలనే సందేశాన్ని ఈ నవల సూచిస్తుంది. సుమారు 60 సంవత్సరాల క్రితం రచయిత వ్యక్తం చేసిన యువతరం పడుతున్న నిస్సహాయ ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోవడం వంటి లోతైన అంశాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టే ఇది ఒక టైంలెస్ నవల. వినుకొండ నాగరాజు గారి సామాజిక విమర్శ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డును కూడా తిరస్కరించారు. తెలుగు ప్రచురణ చరిత్రలో ఇలా గట్టిగా ఎదురు తిరిగిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ సాహితీ వేదికపై నిలబడే విలువ కలిగిన ఈ రచనను, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ఆదరించే ఈతరం పాఠకులు తప్పక చదవాల్సిన శక్తిమంతమైన నవల ఊబిలో దున్న.
Plot
ఊబిలో దున్న రాఘవులు అనే రైతు చుట్టూ సాగే కథ. ఒకరోజు బురద ఊబిలో చిక్కుకుని బయటపడలేకపోతున్న ఒక గేదెను అతను గమనిస్తాడు. దాన్ని అలా వదిలేయడానికి మనసొప్పక, ఎలాగైనా దాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. అలసట, అనిశ్చితి, తనలో తాను కలిగే సందేహాలను ఎదుర్కొంటూనే గంటల తరబడి దాన్ని రక్షించేందుకు మార్గాన్ని అన్వేషిస్తాడు.
రాఘవులు చేసే ఈ పోరాటం క్రమంగా ఒక జంతువును రక్షించే ప్రయత్నాన్ని దాటి, ఒక వ్యవస్థలో చిక్కుకుపోయిన మనిషి పోరాటానికి ప్రతీకగా మారుతుంది. రాజకీయ, పరిపాలనా స్తబ్దతతో ముందుకు సాగలేని సమాజాన్ని ఊబితో పోలుస్తూ, వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితులను రచయిత ఆవిష్కరిస్తారు.
రాఘవులు ఆలోచనలు, చర్యల ద్వారా మానవ పట్టుదల, సామాజిక బాధ్యత, మార్పు కోసం పోరాడే ధైర్యం వంటి అంశాలను వినుకొండ నాగరాజు ప్రస్తావిస్తారు. ఎంత క్లిష్టమైన వ్యవస్థగా కనిపించినా దాన్ని మార్చేందుకు వ్యక్తి తన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని ఈ కథ ఆలోచింపజేస్తుంది.
News & Announcements
No news or announcements for this book yet.
Books Similar to OOBILO DUNNA
Prioritized by same author, then publisher, then overlapping genre












